
రేపు ఢిల్లీ వెళ్లనున్న డీఎస్
రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చలు జోరందుకున్నాయి. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. రాయల తెలంగాణ గురించి కూడా ఆలోచిస్తోంది. ఈ విషయంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ హైకమాండ్తో చర్చించనున్నారు. ఆదివారం సాయంత్రం డీఎస్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ విషయం గురించి రాయల సీమ నేతలతో సంప్రదిస్తున్నారు. కాగా రాయల తెలంగాణపై కాంగ్రెస్లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం గురించి తనకు తెలియదని.. సోనియా గాంధీతో సమావేశానంతరం కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.