
నిజమాబాద్ నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో ధర్మపురి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విచారణకు హాజరైన అనంతరం సంజయ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు. మధ్యలో ఓసారి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి విచారించారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించనున్నారు.
విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్‌పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment