కొంపముంచిందే దిగ్విజయ్ సింగ్... | D Srinivas angry on Digvijay Singh over mlc ticket | Sakshi
Sakshi News home page

కొంపముంచిందే దిగ్విజయ్ సింగ్...

Jun 25 2015 8:38 AM | Updated on Mar 18 2019 9:02 PM

కొంపముంచిందే దిగ్విజయ్ సింగ్... - Sakshi

కొంపముంచిందే దిగ్విజయ్ సింగ్...

శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ టికెట్ రాకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆవేదన చెందినట్లు సమాచారం.

హైదరాబాద్ : శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ టికెట్ రాకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆవేదన చెందినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలపై అనుచరులు, సన్నిహితులతో డీఎస్ తన మనోభావాలను పంచుకున్నారు.

 

ఈ సందర్భంగా పార్టీకి విధేయంగా, అధినేత ఆదేశాలకు అనుగుణంగా, విశ్వాసంగా, వివాదరహితంగా, అందరితోనూ సమన్వయంగా పనిచేసుకుంటూ పోవడమే కొందరు పెద్దలకు నచ్చడం లేదని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా సుముఖంగానే ఉన్నా దిగ్విజయ్ సింగ్ అసూయ, ఈర్ష్యతో అడ్డుపడ్డారని డీఎస్ వాపోయినట్లు తెలిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement