mlc ticket
-
సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్.. అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా
-
కనకారెడ్డి, సుధీర్‌రెడ్డికి ‘ఎమ్మెల్సీ’ అభయం
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రకటించని నియోజకవర్గాల్లో పరిస్థితి అంత సులువుగా దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి, మల్కాజిగిరి స్థానాన్ని ఎమ్మెల్సీ హన్మంతరావుకు ఖరారు చేస్తూ.. తాజా మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తామంటూ పంపిన రాయబారం ఫలించేలా లేదు. తొమ్మిదో తేదీ అనంతరం రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈలోగా మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ తదితర స్థానాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి ఖరారు చేసి ఆయనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో మల్లారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించినా.. నియోకవర్గంలో అందరిమధ్యా సయోధ్య కుదిరే వరకు ప్రచారం చేయవద్దని సూచించి ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చర్చలకు ఆహ్వానించినట్లు సమాచారం. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని, పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి స్వయంగా సుధీర్‌రెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే, తాను కేసీఆర్‌ను కలిసిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుధీర్‌రెడ్డి అసంతృప్తినిగానే వెనుదిరిగినట్లు తెలిసింది. మరోవైపు మల్కాజిగిరిని మైనంపల్లి హన్మంతరావుకు ఖరారు చేసి ఈ మేరకు ఆయనకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. తొలుత తన కోడలు విజయశాంతికి టికెట్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కనకారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నేతలు హామీ ఇచ్చినా ఆయన శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. ముషీరాబాద్, ఖైరతాబాద్‌లో ఢీ అంటే ఢీ నగరంలోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు గురువారం సాయంత్రం లీక్ ఇచ్చాయి. అయితే, ముషిరాబాద్లో తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని, వీలుకాకపోతే తానే పోటీ చేస్తానని హోంమంత్రి నాయిని భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ మాత్రం ముఠా గోపాల్ వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో నాయిని వైఖరి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది. ఖైరతాబాద్ నియోకజవర్గం నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును దాదాపు ఖరారు చేశారన్న వార్తల నేపథ్యంలో బుధవారం పార్టీ నాయకులు పి.విజయారెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అభ్యర్థిని ఎవరినీ ఖరారు చేయలేదని, మీరు తొందరపడవద్దని వారించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రానికి తనకు టికెట్ ఖరారైందని దానం సన్నిహితులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నియోజకవర్గంలో టికెట్ తనకే వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్న విజయారెడ్డి.. దానం నాగేందర్‌ను ఎలాగైనా ఢీ కొట్టే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. గోషామహల్ స్థానాన్ని ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు కేటాయించే అవకాశం ఉంది. -
బలిజలకు మొండిచేయి!
అనుకున్నదే జరిగింది. ‘అనంత’ బలిజలకు చంద్రబాబు మరోసారి మొండిచేయి చూపించారు. ‘గ్రేటర్ రాయలసీమ’లో చిత్తూరు మినహా అన్ని జిల్లాలలోనూ ఎమ్మెల్సీ టిక్కెట్లు ఒకే సామాజికవర్గానికి కేటాయించిన చంద్రబాబు కనీసం ‘అనంత’లోనైనా బలిజలకు కేటాయిస్తారని ఆ సామాజిక వర్గం నేతలు ఆశించారు. అయితే జిల్లాలోని బలిజలకు ఎమ్మెల్సీ ‘స్థాయి’ లేదంటూ పార్టీ అధిష్టానం తేలిగ్గా తీసుకుంది. సమీకరణల్లో బలిజలను మినహాయిస్తే...మైనార్టీకోటాలో తమకైనా టిక్కెట్టు దక్కుతుందని ఆశించిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, మాజీ ఎంపీ సైఫుల్లాను కూడా పార్టీ విస్మరించింది. చివరకు ఆర్థికబలం, అంగబలం ఉన్న దీపక్రెడ్డివైపు మొగ్గుచూపింది. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. ► ‘స్థానిక’ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి! ► మైనార్టీనేతలు అబ్దుల్‌ఘని, సైఫుల్లాకూ నోచాన్ప్ ► అధిష్టానం నిర్ణయంపై బలిజల ఆగ్రహం ► టీడీపీ జెండా మోసినందుకు బుద్ధి వచ్చిందంటూ ఆవేదన అనంతపురం; ‘అనంత’ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల టికెట్లు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడంతో ‘అనంత’ స్థానానికి బలిజ అభ్యర్థిని ప్రకటిస్తారని ఆ సామాజికవర్గ నేతలు భావించారు. ‘అనంత’లో టీడీపీ విజయంలో బలిజ సామాజికవర్గ నేతల పాత్ర కీలకంగా ఉంది. గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గానికి ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్టు కూడా టీడీపీ కేటాయించలేదు. అయినప్పటికీ జిల్లాలో 12 అసెంబ్లీలతో పాటు 2 ఎంపీ స్థానాలు టీడీపీ గెలిపించింది. ఇందులోనూ బలిజ సామాజికవర్గ పాత్ర కీలకంగా ఉంది. ఈ క్రమంలో పట్టభద్రులకోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్నూలుకు చెందిన జనార్ధన్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. దీంతో కర్నూలు, లేదా అనంతపురంలో తమ వర్గానికి టిక్కెట్ కేటాయిస్తారని బలిజలు ఆశపడ్డారు. చంద్రబాబు కూడా ‘సీమ’లో ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులో బలిజలను విస్మరించామని, కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఉద్యమం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మళ్లీ వీరిని విస్మరిస్తే ఈప్రాంతంలో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని భావించారు. దీంతోనే జిల్లా నేతలు దీపక్‌రెడ్డి, గడ్డం సుబ్రహ్మణ్యంపేర్లను తెరపైకి తెచ్చినపుడు ‘గ్రేటర్’లో అన్ని జిల్లాలలో రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్లు ఇస్తున్నామని, కనీసం ‘అనంత’లోనైనా బలిజలకు ఇవ్వాలని జిల్లా నేతలతో చెప్పారు. ఈ విషయం తెలిసి టీడీపీ నేత లక్ష్మీపతి చంద్రబాబును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇది గ్రహించిన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి లక్ష్మీపతికి అడ్డుకట్ట వేసేందుకు లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదెన్నకు మద్దతు తెలపడంతో, ఆదెన్న కూడా బాబు వద్ద తన వాణి వినిపించారు. కానీ బలిజ సామాజికవర్గంలో ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఎవ్వరూ లేరని జిల్లా పార్టీ నేతలు బాబుకు గట్టిగా చెప్పారు. దీంతో మైనార్టీ వర్గం వైపు కూడా బాబు ఆలోచించారు. బాలయ్య కోసం టిక్కెట్టు త్యాగం చేసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే ఘనీ పేరును పరిశీలించారు. దీనికి బాలయ్య అడ్డుపడ్డారు. దీంతో మాజీ ఎంపీ సైఫుల్లా కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నారు. పార్టీకోసం సైఫుల్లా తన కుమారుడు రహంతుల్లాను కోల్పోయారని, దీంతో సైఫుల్లా లేదా ఆయన కుమారుడు జకీవుల్లాకు ఇద్దామని ఆలోచించారు. వీరు పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదని ప్రభాకర్‌చౌదరితో పాటు పలువురు నేతలు బాబుకు చెప్పినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు అభ్యర్థి ఖరారుపై నిర్ణయానికి రాలేకపోయారు. ‘గ్రేటర్’లో అన్ని జిల్లాల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ‘అనంత’ అభ్యర్థి పేరు మాత్రం పెండింగ్‌లో ఉంచారు. దీపక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని జేసీ బ్రదర్స్ చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. జేసీ కుటుంబం నుంచి ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలుగా జేసీ బ్రదర్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వారి కుటుంబానికే చెందిన ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడమేంటని పలువురు నేతలు జిల్లా నేతలతో వాదించారు. కానీ చివరకు దీపక్రెడ్డిపేరును ప్రకటిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బలిజల మండిపాటు టీడీపీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీలోని బలిజ సామాజికవర్గ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీలలో ఒక్కరూ బలిజలు లేరని, కనీసం ఎమ్మెల్సీనైనా చేస్తారనుకుంటే ఆస్థాయి తమకు లేదంటూ తమను తీవ్రంగా అవమానించారని ఇద్దరు కీలక నేతలు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బలిజలు ఈ అవమానాన్ని గుర్తుపెట్టుకుంటారని, పార్టీచేసిన ఈ తప్పుకు భవిష్యత్తులో తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. కాలవ శ్రీనివాసులు, నిమ్మల కిష్టప్పలకు ఎంపీ టిక్కెట్టు కేటాయించినప్పుడు వారి స్థాయి ఏమిటో టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. బీకే పార్థసారథికి టిక్కెట్టు ఇచ్చినపుడు ఆయనస్థాయి ఏమిటో తెలీదా? అని టీడీపీలో చురుగ్గా ఉన్న బలిజ సామాజికవర్గ నేత ఒకరు ప్రశ్నించారు. బలిజలను గౌరవించి రాజకీయప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబు భావిస్తే ఎవరెన్ని చెప్పినా టిక్కెట్టు కేటాయించేవారని, ఈ ఉద్దేశం లేకపోవడంతోనే తమను విస్మరించారని ఆరోపిస్తున్నారు. -
కొంపముంచిందే దిగ్విజయ్ సింగ్...
హైదరాబాద్ : శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ టికెట్ రాకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆవేదన చెందినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలపై అనుచరులు, సన్నిహితులతో డీఎస్ తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి విధేయంగా, అధినేత ఆదేశాలకు అనుగుణంగా, విశ్వాసంగా, వివాదరహితంగా, అందరితోనూ సమన్వయంగా పనిచేసుకుంటూ పోవడమే కొందరు పెద్దలకు నచ్చడం లేదని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా సుముఖంగానే ఉన్నా దిగ్విజయ్ సింగ్ అసూయ, ఈర్ష్యతో అడ్డుపడ్డారని డీఎస్ వాపోయినట్లు తెలిసింది. -
ఆశావహుల్లో తొలగని టెన్షన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎమ్మెల్సీ టిక్కెట్ ఎవరికి కేటాయించేది అన్న విషయం తేలిపోతుందని భావించిన ఆశావహులకు నిరాశే మిగిలింది. అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ విషయమై అధినేత చంద్రబాబు కనీసం మాట్లాడ లేదు. గురువారం జరిగే సమవేశానికి రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికపైనే చంద్రబాబు చర్చిస్తారని అంతా భావించారు. ఆ విషయం తప్ప మిగతా విషయాలన్నీ సీఎం చర్చించారు. అయితే అధినేత సూచన మేరకు ఆశావహులతో ముగ్గురు మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వేరేపార్టీ నుంచి వచ్చిన వారికి నోఛాన్స్ అని అక్కడికక్కడే సంకేతాలిచ్చారు. అలాగే నెల్లిమర్ల సత్యం పేరు కూడా పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. అభ్యర్థి ఎంపికపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతవరకు ఆశావహులు టెన్షన్‌తో ఉండక తప్పదు. అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశావహులతో పాటు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా మంత్రి కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి హైదరాబాద్ వెళ్లారు. గురువారం సాయంత్రం 6.30గంటల తర్వాత జిల్లా నేతల సమావేశం ప్రారంభమయింది. అధినేత ఇచ్చిన డెరైక్షన్‌తో ముందుగా జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలతో మంత్రులు అశోక్ గజపతిరాజు, పల్లె, మృణాళిని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎవరికి టిక్కెట ఇస్తే బాగుంటుందని అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అంతా ‘ మీ నిర్ణయమే మా నిర్ణయం’ అని మంత్రులకే వదిలేశారు. జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మాత్రం తన తల్లి శోభా హైమావతికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. పార్టీకి సుదీర్ఘంగా అందించిన సేవల్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, టిక్కెట్ ఆశావహులతో మం త్రులు సమావేశమయ్యారు. టిక్కెట్ ఆశిస్తున్నవారి జాబితా చాలా పెద్దదిగా ఉండడంతో కాసింత ఆశ్చర్యం వ్యక్తం చేశా రు. ఈ క్రమంలో పార్టీలు మారిన వారిని నో ఛాన్స్ అని చెప్పేశారు. దీంతో గద్దే బాబూరావు, కొండపల్లి కొండలరావు ఆశావహుల జాబితాలోంచి తప్పించినట్టయింది.సమావేశం ముగి శాక ఆశావహులతో మంత్రులు విడివిడిగా భేటీ అయ్యారు. శోభా హైమావతి, ద్వారపురెడ్డి జగదీష్, తెంటు ల క్ష్ముంనాయుడు, గద్దే బాబూరావు, కె.త్రిమూర్తులరాజు, ఐవీపీ రాజు, భంజ్‌దేవ్, మహంతి చిన్నంనాయుడు, తూముల భాస్కరరావు, కరణం శివరామకృష్ణ, కొండపల్లి కొండలరావుతో వేర్వేరుగా మాట్లాడారు. తమకు టిక్కెట్ ఇవ్వవల్సిన ఆవశ్యకతను, తన అభిప్రాయాలను వారు వెల్లడించారు. వీరితో భేటీ ముగి సాక జిల్లా నేతలందరితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కనీసం మాట్లాడలేదు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ భూసేకరణ ఎలా చేయాలన్నదానిపై చర్చించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో బొత్స చేరికపైనా, వైఎస్సార్సీపీలో ప్రస్తుతం ఉన్న నేతల పరిస్థితిపైనా ప్రధానంగా ఆరాతీశారు. ఎమ్మెల్సీ టిక్కె ట్ ఊసెత్తకుండా సమావేశాన్ని ముగించేశారు. మంత్రులకు మాత్రం శుక్రవారం కలవాలని ఆదేశించారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని వెళ్లిన ఆశావహులంతా నిరాశతో వెనుదిరిగారు. -
లలితకే టికెట్
-
లలితకే టికెట్
* మహిళా కోటాలో హైకమాండ్ నిర్ణయం * డి. శ్రీనివాస్‌కు తప్పని నిరాశ * ఏఐసీసీలో చోటు లభించే అవకాశం! * టీఆర్ఎస్ నేతలకూ ఈసారి నో * టీడీపీలో ‘అరికెల’ ప్రయత్నం వృథా! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్కంఠ తొలగిపోయింది. ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత పేరును బుధవారం సాయంత్రం ఖరారు చేసింది. గురువారమే నామినేష్లకు చివరి గడువు కావడంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురు చూశారు. చివరకు ఆకుల లలిత పేరును ప్రకటించడంతో సస్పెన్స్ వీడిపోయింది. దీంతో ఆమె వర్గీయులు రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ పదవి కోసం శాసనమండలి లో విపక్ష మాజీ నేత డి.శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించారు. సీనియర్ నాయకుడిగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత తనదేనని, ఈసారి కూడ ఎమ్మెల్సీ టిక్కెట్టు తనకే దక్కుతుందని మొదటి నుంచి డీఎస్ ఎంతో భరోసాగా ఉన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించ లేదు. తన రాజకీయ గురువుగా భావించే డీఎస్‌పై ఆకుల లలిత పైచేయి సాధించారు. మహిళా కోటాలో ఆమెకు అదృష్టం వరించింది. సీడబ్ల్యూసీలోకి డీఎస్! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే శాసనమండలి విపక్ష నేతగా పదవీ విరమణ చేసిన ధర్మపురి శ్రీనివాస్‌కు అవకాశం ఉంటుందని భావించినా హైకమాండ్ లలిత వైపే మొగ్గు చూపింది. చాలా మంది పోటీపడినా, అధిష్టానం వద్ద లాబీరుుంగ్ చేసినా, వారికి ప్రయోజనం లేకుండాపోయింది. డీఎస్ కూడా మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేం దుకు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, మహిళకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణరుుంచడంతో ఆయన కోరిక నెరవేరకుండా పోయింది. మరోవైపు జిల్లాలోని కాంగ్రెస్ గ్రూపులన్నీ లలితవైపే నిలవడంతో డీఎస్ ఒంటరయ్యూరని తెలుస్తోం ది. శాసనమండలిలో విపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మా మహేశ్‌కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తదితరులు ఆకుల లలితకే టికెట్ వచ్చేలా కృషి చేశారని సమాచారం.అయితే, పార్టీకి దీర్ఘకాలంగా సేవలను అందిస్తూ వచ్చిన డీఎస్‌కు పార్టీలోనే మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏఐసీసీలోగానీ, పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీలోగానీ చోటు కల్పిస్తామని డీఎస్‌కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. టీఆర్ఎస్ నేతలకు నిరాశే! సాధారణ ఎన్నికలలో తిరుగులేని విజయూలను సాధించినప్పటికీ, కొన్ని సమీకరణాల కారణంగా జిల్లా టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండబోదని స మాచారం. ఈ విషయూన్ని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఆశావహ నేతలకు స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఆరింటిలో నాలుగు స్థానాలకే పార్టీ పోటీచేసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నవారికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా, ఎ మ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పిన నేతలకు ‘స్థానిక సంస్థల’లో అవకాశం ఇస్తామ ని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పలువురు నేతలు నిరాశకు గురయ్యారు. టీడీపీలోనూ అంతే టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఇంకా ఆశలు వదులుకోలేదు. త్రీమెన్ కమిటీ నిర్ణయంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మ రోవైపు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఏ నిర్ణయం వెలువడలేదు. 1983 నుంచి పార్టీలో కొనసాగుతూ మండల కన్వీనర్ నుంచి శా సనమండలి నేత వరకు ఎదిగిన ‘అరికెల’ టీఆర్ఎస్ గాలం వేసినా పార్టీ వీడలేదు. ఆయనకు అవకాశం ఉంటుందా లేదా అన్నది గురువారం ఉదయం వరకు తేలిపోవచ్చు. -
నాయకా ‘టికెట్’
ఎమ్మెల్సీ రేసులో తెలుగు తమ్ముళ్లు ఎస్టీ కోటాలో మణికుమారి పేరు ఖరారు! సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు శని వారం లేక్‌వ్యూ అతిథి గృహానికి క్యూ కట్టారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ అక్కడ ఉన్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును కలసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాల్సిందిగా కోరారు. బాబును కలసిన వారిలో శాసనమండలిలో చీఫ్‌విప్ న న్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు ఎన్ఎండీ ఫారూఖ్, జేఆర్ పుష్పరాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాందువ్వ శ్రీను (మంతెన వెంకట సత్యనారాయణ రాజు), పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ తదితరులున్నారు. వీరందరూ ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీ లించాల్సిందిగా కోరారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా బాబుకు గుర్తుచేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న జూపూడి ప్రభాకరరావును తిరిగి అదే కోటాలో నామినేట్ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరి, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి.. మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తుందనగా టీడీపీలో చేరిన వ్యక్తికి ఎలా అవకాశం కల్పిస్తారని పలువురు ఆశావహులు సీనియర్ల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అనేక మంది పార్టీలో ఎంతోకాలంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. కాగా, ఎస్టీ కోటాలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి పేరును ఖరారు చేసి ఆమెకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనారిటీలకు చాన్స్ దక్కడం కొంచెం కష్టమే. గవర్నర్ కోటాతో కలుపుకొని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఇపు డు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఆ సమయంలో మైనారిటీకి అవకాశం కల్పించాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో టీడీపీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా ఇప్పటికే వీవీవీ చౌదరి పేరు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో తమ విజయానికి కృషి చేసిన వారికి టికెట్లు ఇవ్వాలని పలువురు మంత్రులు సీఎంను కలసి కోరారు. -
కైకలూరు టీడీపీలో ఎమ్మెల్సీ రగడ
విజయవాడ : ఎన్నికల సమయంలో..అప్పటి కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు బుధవారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ... ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు ఎమ్మెల్యే సీటు కేటాయించారని తెలిపారు. ఆ సమయంలో జయమంగళకు ఎమ్మెల్సీ సీటును ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించే ఎమ్మెల్సీ జాబితాలో తొలిగా జయమంగళ పేరు ఉండాలని ఈ సందర్బంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై జిల్లాలోని మంత్రులను కలిసి ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవాలని వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సహకార సంఘాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, కలిదిండి, ముదినేపల్లి మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు నున్న రమాదేవి, భూపతి నాగకల్యాణి, బండి లక్ష్మి, పోసిన కుమారి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
‘పల్లా’కు ఎమ్మెల్సీ టికెట్..?
నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్టభద్రుల స్థానానికి పల్లాను పోటీలో నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారికంగా పల్లా పేరును ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది. చివరివరకు టికెట్ వస్తుందని ఆశించినపార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిని కూడా అందుబాటులో ఉండాల్సిందిగా సీఎం పేర్కొన్నట్లు సమాచారం. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పల్లా పోటీచేసి ఓడిపోయారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన కోదాడలో అనురాగ్ పేరుతో ఇంజినీరింగ్, ఇతర విద్యాసంస్థలను నిర్వ హిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలతో పల్లాకు సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మంత్రి జగదీష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇదిలా ఉంటే బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కూడా వరంగల్ జిల్లాకు చెందిన రామ్మోహన్రావు కావడం గమనార్హం. పట్టభద్రుల స్థానానికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులను వరంగల్ జిల్లా నుంచే ఎంపిక చేయడం విశేషం. మూడో నామినేషన్లు నిల్ ... పట్టభద్రుల స్థానానికి మూడో రోజు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. ఆదివారం నాటి కి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తియ్యే అవకాశం ఉంది. కావున సోమవారం నామినేషన్లు దాఖలుకానున్నాయి.