లలితకే టికెట్ | congress mlc canditate akula lalitha | Sakshi
Sakshi News home page

లలితకే టికెట్

Published Thu, May 21 2015 2:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

లలితకే టికెట్ - Sakshi

లలితకే టికెట్

* మహిళా కోటాలో హైకమాండ్ నిర్ణయం
* డి. శ్రీనివాస్‌కు తప్పని నిరాశ
* ఏఐసీసీలో చోటు లభించే అవకాశం!
* టీఆర్‌ఎస్ నేతలకూ ఈసారి నో
* టీడీపీలో ‘అరికెల’ ప్రయత్నం వృథా!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్కంఠ తొలగిపోయింది. ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత పేరును బుధవారం సాయంత్రం ఖరారు చేసింది. గురువారమే నామినేష్లకు చివరి గడువు కావడంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురు చూశారు. చివరకు ఆకుల లలిత పేరును ప్రకటించడంతో సస్పెన్స్ వీడిపోయింది. దీంతో ఆమె వర్గీయులు రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ పదవి కోసం శాసనమండలి లో విపక్ష మాజీ నేత డి.శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించారు.

సీనియర్ నాయకుడిగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత తనదేనని, ఈసారి కూడ ఎమ్మెల్సీ టిక్కెట్టు తనకే దక్కుతుందని మొదటి నుంచి డీఎస్ ఎంతో భరోసాగా ఉన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించ లేదు. తన రాజకీయ గురువుగా భావించే డీఎస్‌పై ఆకుల లలిత పైచేయి సాధించారు. మహిళా కోటాలో ఆమెకు అదృష్టం వరించింది.  
 
సీడబ్ల్యూసీలోకి డీఎస్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే శాసనమండలి విపక్ష నేతగా పదవీ విరమణ చేసిన ధర్మపురి శ్రీనివాస్‌కు అవకాశం ఉంటుందని భావించినా హైకమాండ్ లలిత వైపే మొగ్గు చూపింది. చాలా మంది పోటీపడినా, అధిష్టానం వద్ద లాబీరుుంగ్ చేసినా, వారికి ప్రయోజనం లేకుండాపోయింది. డీఎస్ కూడా మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేం  దుకు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, మహిళకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణరుుంచడంతో ఆయన కోరిక నెరవేరకుండా పోయింది.

మరోవైపు జిల్లాలోని కాంగ్రెస్ గ్రూపులన్నీ లలితవైపే నిలవడంతో డీఎస్ ఒంటరయ్యూరని తెలుస్తోం ది. శాసనమండలిలో విపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మా మహేశ్‌కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తదితరులు ఆకుల లలితకే టికెట్ వచ్చేలా కృషి చేశారని సమాచారం.అయితే, పార్టీకి దీర్ఘకాలంగా సేవలను అందిస్తూ వచ్చిన డీఎస్‌కు పార్టీలోనే మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏఐసీసీలోగానీ, పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీలోగానీ చోటు కల్పిస్తామని డీఎస్‌కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.
 
టీఆర్‌ఎస్ నేతలకు నిరాశే!
సాధారణ ఎన్నికలలో తిరుగులేని విజయూలను సాధించినప్పటికీ, కొన్ని సమీకరణాల కారణంగా జిల్లా టీఆర్‌ఎస్ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండబోదని స మాచారం. ఈ విషయూన్ని టీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే ఆశావహ నేతలకు స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఆరింటిలో నాలుగు స్థానాలకే పార్టీ పోటీచేసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నవారికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా, ఎ మ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పిన నేతలకు ‘స్థానిక సంస్థల’లో అవకాశం ఇస్తామ ని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పలువురు నేతలు నిరాశకు గురయ్యారు.
 
టీడీపీలోనూ అంతే
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఇంకా ఆశలు వదులుకోలేదు. త్రీమెన్ కమిటీ నిర్ణయంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మ  రోవైపు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఏ నిర్ణయం వెలువడలేదు. 1983 నుంచి పార్టీలో కొనసాగుతూ మండల కన్వీనర్ నుంచి శా సనమండలి నేత వరకు ఎదిగిన ‘అరికెల’ టీఆర్‌ఎస్ గాలం వేసినా పార్టీ వీడలేదు. ఆయనకు అవకాశం ఉంటుందా లేదా అన్నది గురువారం ఉదయం వరకు తేలిపోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement