అంతా సస్పెన్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రెండు రో జులు అంతంత మాత్రంగా నే నామినేషన్లు దాఖలయ్యా యి. బుధవారం ఊపందుకోగా గురువారం భారీ స్థాయిలో నామినేషన్లు వేశారు. జిల్లావ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 945 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. మున్సిపాలిటీలలో నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు. నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఇంకా నేతల చేతులలోనే
మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడంలో ప్రధాన పార్టీలు చేస్తున్న తాత్సారం అశావహులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం, న్యూడెమోక్రసీ పార్టీలు ఈ ఎన్నికలలో తలపడనున్నాయి. ఆయా పార్టీల పేరు మీద ఇప్పటికే చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఏ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. బీ ఫారాలు ఇవ్వలేదు.
డీఎస్ ఆధ్వర్యంలో సమావేశం
నిజామాబాద్ నగర పాలక సంస్థ నుంచి మేయర్ అభ్యర్థిని ఖరారు చేసే విషయమై పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఇప్పటికే ఓ సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ ఆ పార్టీ కార్పొరేటర్లు, మేయర్ అభ్యర్థి పేర్లు ఇంకా ప్రకటించలేదు. టీఆర్‌ఎస్ అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జి బస్వ లక్ష్మీనర్సయ్య మేయర్ స్థానానికి నలుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం మేయర్ అభ్యర్థిని తేల్చలేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి దీనంగా ఉంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేందుకు వైఎస్‌ఆర్ సీపీ కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నాయి. నాలుగైదు రోజులలోమున్సిపాలిటీలలో శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కానుంది. శనివారం నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది జాబితాను మంగళవారం ప్రకటి స్తారు. ఆ రోజు నుంచి ప్రచారం ఊపందుకోనుంది.