మాటలు మార్చే కేసీఆర్‌కు ఓట్లు రాలవు | telangana bringing and giving congress | Sakshi
Sakshi News home page

మాటలు మార్చే కేసీఆర్‌కు ఓట్లు రాలవు

Published Mon, Apr 21 2014 1:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

telangana bringing and giving congress

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఇంతకాలం సొమ్ము చేసుకున్న కేసీఆర్ మాటలకు
 ఇక ఓట్లు రాలే కాలం పోయిందన్నారు. నిజామాబాద్‌లోని  స్వగృహంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తమకే పట్టం కడతారన్నారు. తెలంగాణ ప్ర జలలో ఉన్న బలమైన సెంటిమెంట్‌ను కేసీఆర్ ఇంతకాలం సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.

 తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షను సోని యాగాంధీ, కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిం దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వసే ్తనే బంగారు తెలంగాణ సాధ్యమన్నా రు. డిచ్‌పల్లిలో రాహుల్‌గాంధీ బహిరంగసభ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతోందన్నారు. నిజామాబాద్‌లోని కలెక్టరేట్, పాలిటెక్నిక్ కళాశాల మైదానం కోసం ప్రయత్నించినా అనుమతి దొరకలేదని, అందుకే డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలో రాహుల్ సభ నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే సభను మధ్యాహ్నం 3.30 గంటలకు మార్చినట్లు డీఎస్ చెప్పారు.

 మహ బూబ్‌నగర్‌లో మరో బహిరంగసభ ఉన్నందున, కొంత ఆలస్యంగా జరుగుతుందని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు సభకు తరలివస్తారన్నారు. రాహుల్‌గాంధీ సభ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రోగ్రాం కో ఆ ర్డినేటర్ సి.శ్రీనివాస్‌రావు, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి ఘన్‌రాజ్ తదితరులులు పాల్గొన్నారు.

 భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్‌పీజీ
 డిచ్‌పల్లి: సభకు రాహుల్ హాజరవుతుండటంతో ఎస్‌పీజీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్  రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, ఎస్‌పీ తరుణ్‌జోషి, డీఎస్‌పీ అనిల్‌కుమార్ సహకరిస్తున్నారు.సభా వేదిక ఏ స్థలంలో ఏర్పాటు చేయాలి, సభకు హాజరయ్యే ప్రముఖులు, ఇతర నాయకుల వాహనాలను ఎక్క డ పార్కు చేయాలనే విషయాలపై స్థానిక పోలీసు అధికారులకు ఎస్‌పీజీ అధికారులు తగిన సూచనలు ఇచ్చారు.

 సభా ప్రాంగణాన్ని ఆదివారం మధ్యాహ్నం పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ పరిశీలించారు.  ఎండాకాలం కావడం తో సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కుర్చీలో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలి పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తాహెర్‌బిన్ హందాన్, నగేశ్‌రెడ్డి, ఘన్‌రాజ్, సురేం దర్,  గజవాడ జైపాల్, కంచె ట్టి గంగాధర్, దాసరి లక్ష్మినర్సయ్య, అమృతాపూర్ గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, అంబర్‌సింగ్, అశోక్, రాంచందర్‌గౌడ్, వెంకటరమణ, చిన్న య్య, నర్సయ్య, సాయన్న  తదితరులు ఉన్నారు. వేదికకు సుమారు 20 అడుగుల దూరంలో హెలీపాడ్‌ను సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement