
విభజన కోసం రాజ్యాంగ సవరణ: డిఎస్
హైదరాబాద్: విభజన సాఫీగా సాగేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తారని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర విభజనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి అడ్డురాదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విభజనతో సీమాంధ్రలో వచ్చే నష్టాలపై చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలోనూ ప్రయోజనాలు అనేకం ఉన్నాయని తెలిపారు. సీమాంధ్రకు మంచి ప్యాకేజీ లభిస్తుంది, అన్యాయం జరగదని చెప్పారు. బిల్లు ఆమోదంపొందాక సీమాంధ్ర ప్యాకేజీని ప్రకటించవచ్చునన్నారు. అప్పుడు సీమాంధ్రలోనూ కాంగ్రెస్ బలపడుతుందని చెప్పారు. టిఆర్ఎస్ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, అధిష్టానం పెద్దలు మాట్లాడుకుంటారన్నారు. కెసిఆర్తో విభేదాలు ఏమీలేవని, ఆయన తమకు మంచి స్నేహితుడని చెప్పారు.