
సతీశ్‌పవార్ మృతితో విషాదం
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్‌పవార్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొంత కాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారం భి ంచిన ఆయన నిజామాబాద్‌లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. అనంతరం నేరుగా జరిగిన ఎన్నికలలో చైర్మన్‌గా గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ గురువు డి. శ్రీనివాస్‌పై పోటీ చేసి గెలుపొందారు.
2004లో మరొక సారి పోటీ చేసి ఓడిపోయారు. 2005లో జరిగిన మున్సిప ల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలతో కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీకి మెజార్టీ రాకపోవడంతో మేయర్ పదవి దక్కలేదు. 2010లో నిజామాబాద్ అర్బన్ ఉప ఎన్నికల సందర్బంగా టీడీపీకి రాజీనామా చేసి డీఎస్ సమక్షంలోనే తిరిగి స్వంత గూటికి చేరారు. ఓ వైపు రాజ కీ యాలలో ఉంటూనే మరోవైపు సినీరంగంలో అడిగి పెట్టి పలు చిత్రాలకు పంపిణీదారుగా వ్యవహరించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
శాసనమండలి విపక్షనేత డి. శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, కామా రెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌గౌడ్, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాతాశ్రీశైలం,ఎమ్మెల్సీ రాజేశ్వర్ సతీశ్‌పవార్ మృత దే హంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. పవార్ మృతదేహాన్ని చూసి డీఎస్ కంటతడిపెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, జనార్దన్‌గౌడ్ కాంగ్రెస్, టీడీ పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు, ప్రజలు అంత్యక్రియలలో పాల్గొన్నారు.