తెలంగాణలోని సీమాంధ్రులంతా తెలంగాణవారే! | Seemandhra people who are living in telangana are Telangana people | Sakshi
Sakshi News home page

తెలంగాణలోని సీమాంధ్రులంతా తెలంగాణవారే!

Published Sun, Feb 23 2014 6:03 PM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

డి.శ్రీనివాస్

డి.శ్రీనివాస్

 హైదరాబాద్: తెలంగాణలో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణవారేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం  తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో 75 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని తెలిపారు.  సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలిపారు.  తెలంగాణ వారంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు.

 తెలంగాణ, సీమాంధ్రలో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన  కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్వార్ధం కోసం అధికార, ధన బలంతో ప్రజల మధ్య రాగద్వేషాలను పెరిగేలా చేశాడని పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement