తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని నేనే: డీఎస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఒక్కడే లేడని, ఉద్యమంలో చాలా మంది మమేకం అయ్యారని నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్ అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని తానేనని చెప్పారు. నిజామాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం మొదట అసెంబ్లీలో మూడుగంటల పాటు మాట్లాడింది తానేనన్నారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ‘తెలంగాణ’ కోసం ఉద్యమాలు చేస్తోందన్నారు. ‘‘ఎమోషనల్ ఇష్యూస్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుంటున్న కేసీఆర్‌కు ఈ సారి తెలంగాణ ప్రజలు ప్రతికూలమైన తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని జోస్యం చెప్పారు.