కాసేపట్లో డీ.శ్రీనివాస్ ప్రెస్మీట్
హైదరాబాద్ : గులాబీ గూటికి చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ గురురవారం ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా వివరించనున్నారు. కాగా డీఎస్ తన రాజీనామా ఇవాళ ప్రకటించనున్నారు. అలాగే టీఆర్‌ఎస్‌లో చేరడంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లుగా బుధవారం రాత్రే ఏఐసీసీ నాయకత్వానికి డీఎస్ ఒక లేఖను ఫ్యాక్స్ చేశారు.