
కేసీఆర్‌కు స్వార్థం పెరిగింది: డీఎస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు స్వార్థం ఎక్కువై పోయిందని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి డి.శ్రీనివాస్ విమర్శించారు. శనివారం నిజామాబాద్‌లో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ కోసం సకల జనుల సమ్మె, మిలీనియం మార్చ్, విద్యార్థి జేఏసీ, ఉద్యోగ జేఏసీ వర్గాలు ఉధృతంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ అజ్ఞాతంలో ఉన్న ఆయన.. 2014 ఎన్నికల ముందు ఉద్యమం చేస్తే ఎన్నికలో గెలువచ్చాన్న కారణంతో తెరపైకి వచ్చాడని విమర్శించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసి కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, చూసి చలించిన సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు.