
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించనుంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థలకు మంగళవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. అభ్యర్థుల ఖరారుపై సీఎం కేసీఆర్ మూడు జిల్లాల మంత్రులతో మాట్లాడారు. ఈమేరకు శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, సి.హెచ్.మల్లారెడ్డిలు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. మూడు జిల్లాల నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారి పేర్లను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా రాజకీయ పరిస్థితులను మంత్రులు వివరించారు. అభ్యర్థులు ఎవరైనా కచ్చితంగా గెలిచేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఎన్నికల వ్యూహం ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment