
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులను అభ్యర్థులుగా ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో డి. రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ మరోసారి అవకాశం దక్కించుకున్నారు.
ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు రేపు(సోమవారం) నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సామాజిక సమీకరణలు, పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుడు.