టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులను అభ్యర్థులుగా ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో డి. రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ మరోసారి అవకాశం దక్కించుకున్నారు.