
సాక్షి, హైదరాబాద్: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఏ స్థాయి నాయకుడైనా కఠిన చర్యలు తీసుకుంటా మని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హెచ్చరిం చారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే ముందుకెళ్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సిం హులు, పెద్దిరెడ్డితో కలసి విలేకరులతో మాట్లా డారు. భావసారూప్యత ఉన్న పార్టీలతోనే వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 8న చంద్రబాబు తో జరిగిన సమావే శంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ నేత లు నడుచుకోవాలని సూచించారు. గతంలో తనపై కూడా ఆరోపణలొస్తే వివరణ ఇచ్చానని గుర్తు చేశారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసినట్లు వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. కాగా, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని పెద్దిరెడ్డి చెప్పారు. టీడీపీలో రేవంత్ మాట వినేవారు ఎవరూ లేరని, అందరూ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండే వారే ఉన్నారని మోత్కుపల్లి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment