'గవర్నర్ చర్యలు తీసుకోకుంటే... కోర్టును ఆశ్రయిస్తాం'
హైదరాబాద్ : సచివాలయం తరలింపును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ రాజభవన్లో గవర్నర్ను కలసి... సచివాలయం, చెస్ట్ ఆసుపత్రి తరలింపును ఆపాలని టీ టీడీపీ నేతలు గవర్నర్కు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం రాజభవన్ వెలుపల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... ప్రభుత్వ భూములను విక్రయించి ఖజానా నింపుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అడ్డుకునే చర్యలు గవర్నర్ చేపట్టకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.