ఏ రోజు ఏం కూలగొడ్తరో: కిషన్రెడ్డి
హైదరాబాద్: ఏ రోజు ఏం కూలగొడతారో తెలియని అయోమయ స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గిరిజన సమస్యలను పరిష్కరించకుండా సచివాలయాన్ని కూలగొడ్తానంటూ, ఎర్రగడ్డకు తీసుకపోతానంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎస్టీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులను దారి మళ్లిస్తే బాధ్యులైన ప్రజా ప్రతినిధులు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.