
సారంగాపూర్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేకుండా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో ఆయన ఆదివారం విలేక రులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని బలహీనపరచ డానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నాయని ఆరోపించారు.
ఆయా పార్టీల్లోకి టీడీపీ నేతలను చేర్చుకోవడం ఇందులో భాగమేనని చెప్పారు. బీజేపీతో పొత్తు పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుందన్నారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. నాయకుల కొనుగోళ్లకు టీఆర్‌ఎస్ తెరలేపిందని, ఉద్యమపార్టీ ముసుగులో లాభ పడిందని విమర్శించారు. తెలంగాణలో తెలుగుదేశంపార్టీ బలహీ నంగా ఉందన్న విషయం వాస్తవంకాదని, పార్టీని బలహీనపరిచి, తమ బలం పెంచుకోవడానికి ఎదుటి పార్టీలు పనిచేస్తున్నాయని రమణ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment