
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలను, ఆ పార్టీ ఏఐసీసీ ఉపాధ్య క్షుడు రాహుల్‌ను కలసినట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలు ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు.
రేవంత్‌రెడ్డి పార్టీ మారనున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాను వివరణ కోరినట్లు మంగళవారం విలేకరులకు చెప్పారు. అయితే ఆయన నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నామన్నారు. 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున టీడీఎల్పీ సమావేశం నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు.