
ఎంపీ కవిత వసూళ్లకు పాల్పడుతున్నారు: టీడీపీ
హైదరాబాద్ : రైతు కుటంబాలకు నష్టపరిహారం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత వసూళ్లకు పాల్పడుతున్నారని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్కు కనువిప్పు కలిగించాలని ఆయన కవితకు సూచించారు. ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. . మాట నిలబెట్టుకునే అలవాటు కేసీఆర్కి లేదని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద టీడీపీ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సహకార బ్యాంకు వద్ద ధర్నాకు వెళ్తున్న క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.