హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగుల కలలు చూపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలో వారిద్దరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమార్కులకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా జీహెచ్ఎంసీని గెలవాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని వారు ఆరోపించారు. ప్రధాని వాజ్పేయ్, చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ మైండ్ గేమ్లో పడొద్దు అని హైదరాబాద్ నగర ప్రజలుకు కిషన్రెడ్డి, ఎల్ రమణ హితవు పలికారు.