మక్తల్: జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని టీ.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కోరారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందితే వ లసలు అరికట్టొచ్చన్నారు. ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదని విమర్శించారు. బుధవారం మక్తల్ మండలంలో సంగంబండ భీమా ప్రాజెక్టు, చి న్నగోప్లాపూర్ సర్జికల్ క్యాంప్‌ను మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ బృందం పరిశీలించింది. ఈ సం దర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తే పాలమూరు సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇక్కడినుంచి గతంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్ జిల్లాపై శ్రద్ధచూపించలేదన్నారు. భీమా ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు మంజూరుచేస్తే పెండింగ్ పనులు పూర్తవడంతోపాటు జిల్లారైతులకు ఎంతోమేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమంకోసం టీడీపీ పనిచేస్తుందన్నారు.
సీఎంకు పాలనపై అవగాహన లేదు
టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్ అహంకారం తగ్గించాలన్నారు. అధికారం చేపట్టి 14నెలలు దాటినా పాలనపై పట్టు సాధించలేదన్నారు. కేసీఆర్‌కు పరిపాలనపై అవగాహన ఎంతమాత్రం లేదన్నారు. కర్ణాటక ప్రభ్వుం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నా కేసీఆర్ నోరుమొదపడం లేదన్నారు. కర్ణాటక బ్యారేజ్‌కంరోడ్ కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు టీడీపీ వ్యతిరేకం కాదన్నారు. భీమా ఎత్తిపోతలకు రూ.250కోట్లు ఖర్చుచేస్తే ప్రాజె క్టు పూర్తవుతుందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పనులు పూర్తిచేస్తే జిల్లా సస్యశామలం అవుతుందన్నారు.
టీడీపీ పాలనలోనే పాలమూరు ప్రాజెక్టులు నిర్మించినట్లు చెప్పారు. అనంతరం నీటిపారుదల శాఖ ఎస్‌ఈ అజయ్‌కుమార్‌తో ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బృందంలో ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, వివేకానంద్, రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి, రాములు, జర్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సిములు, జిల్లా మాజీ చైర్మన్ జయశ్రీ, టీడీపీ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, ఖానాపూర్ సర్పంచ్ వెంకటయ్యగౌడ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
Published Fri, Aug 14 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement