pending projects
-
అన్ని గేట్లు ఎత్తి పెట్టాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ సహా మిగతా రెండు బరాజ్‌ల గేట్లను పూర్తిగా ఎత్తి పెట్టాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్ర ప్రభుత్వానికి తేలి్చచెప్పింది. ప్రస్తుతం బరాజ్‌ల్లోకి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేయాలని సూచించింది. సోమవారం మరోమారు ఇంజనీర్ల స్థాయిలో చర్చించి, తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని తెలిపింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో సమావేశమయ్యారు.మంత్రితో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శులు రాహుల్ బొజ్జ, ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, కాళేశ్వరం సీఈ సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులు, నీటి తరలింపు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల్లో మరమ్మతులు, పునరుద్ధరణలో భాగంగా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు చేపట్టిన పనుల వివరాలను ఇంజనీర్లకు వివరించారు.సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్‌ఎమ్మార్‌ఎస్‌కు సంబంధించిన నివేదికలు పూర్తి స్థాయిలో అందనందున బరాజ్‌ల్లో నీటి నిల్వలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం చేయలేమని, ఈ దృష్ట్యా అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడమే ఉత్తమమని ఎన్డీఎస్ఏ చైర్మన్ స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భేటీ వివరాలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకు: ఉత్తమ్ కాళేశ్వరం బరాజ్‌ల విషయంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ముందుకు వెళతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘బరాజ్‌లో నీటి నిల్వలు, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించాం. ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే చేపట్టిన పనులను, పరీక్షలను వివరించాం. ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పాం. దీనిపై వారు ఇప్పటికైతే అన్ని గేట్లు ఎత్తిపెట్టి నీళ్లు కిందకి వదిలేయండని చెప్పారు. దానికి అనుగుణంగానే అన్ని గేట్లు ఎత్తినీటిని వదిలేస్తాం.దీనిపై కేబినెట్లోనూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం’అని వివరించారు. మేడిగడ్డలో మాత్రం ఒక గేటు పనిచేయడం లేదని, దానిని పూర్తిగా కట్ చేసి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మేడిగడ్డతో పాటు అన్నారంలో సీపేజీలను, సుందిళ్లలో కొన్ని లోపాలను కేంద్ర సంస్థ గుర్తించిందని, ప్రజా జీవితాలకు సంబంధించిన విషయమైనందున నిపుణుల సూచన మేరకే ముందుకెళ్తామన్నారు. ఎల్లంపల్లి ఎగువన నీటిని వినియోగించుకొని, ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. కుంగిందెప్పుడు..ఆర్కిటెక్ట్ ఎవరు..? ఈ సందర్భంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌ని వినియోగించుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘కేవలం కమిషన్ల కోసం తుమ్మడిహెట్టి డిజైన్‌ను మేడిగడ్డకు మార్చారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యేదాన్ని రూ.1.50లక్షల కోట్లకు పెంచారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని తప్పుడు లెక్కలు చెప్పారు.తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చని అంచనా వేస్తే, ఇప్పుడు కాళేశ్వరంతో ఏటా ఖర్చు రూ.10వేల కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీలకే ఏటా రూ.15వేల కోట్లవుతున్నాయి. ఇంతా చేసి ఏడాది 13 టీఎంసీల చొప్పున ఐదేళ్లలో 65 టీఎంసీలు ఎత్తిపోశారు. దీనికి కర్త, ఆర్కిటెక్ట్, బిల్డర్ అన్నీ కేసీఆర్ అన్ని గొప్పలు చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగితే మాత్రం ఒక్క మాట మాట్లాడలే. ప్రాజెక్టు నాశనం చేసిన వాళ్లే ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. అబధా్ధలు చెప్పడానికైనా కేటీఆర్‌కు హద్దుండాలి’అని ఉత్తమ్ విరుచుకుపడ్డారు. మా హయాంలోనే తుమ్మిడిహెట్టి పూర్తి.. ఇక తమ హయాంలోనే తుమ్మిడిహెట్టి బరాజ్‌ని పూర్తి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్ర స్తుత వరద దృష్ట్యా ఏ ప్రాజెక్టులోనూ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంజనీర్లను అప్రమత్తం చేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజె క్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు అని, 90 శాతం ఆయకట్టు ఏపీలో ఉందని, ఐదు అడుగుల మేర వరద రావడంతో అక్కడ కొన్ని ఇక్కట్లు ఎదురయ్యాయని ఉత్తమ్ వెల్లడించారు. -
పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సచివాలయంలో పాలమూరు–రంగారెడ్డి, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపై మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్న ం శ్రీనివాస్‌రెడ్డి(మహబూబ్‌నగర్), వాకిటి శ్రీహరి ముదిరాజ్(మక్తల్), జి.మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర), డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట)లతో కలిసి, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్, నారాయణ పేట, మక్తల్ నియోజవర్గాలకు నీరందించడానికి వీలుగా నారాయణపేట–కొడంగల్ ఎత్తి పోతల పథకం చేపట్టడానికి వీలుగా 2014 మే 28వ తేదీన ఉత్తర్వులుజారీ చేశారని, ఆ ప్రాజె క్టును చేపడితే కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు నీరందేదని, దీనికోసం రూ.133.86 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చినా, ఆ పథకాన్ని చేపట్టలేదని, నివేదించారు. తక్షణమే ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతినివ్వా లని వీరు నివేదించగా... మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రేవంత్‌రెడ్డి పట్టుదలతో 2014 మేనెలలోనే నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం పరిపాలన అనుమతినిస్తే... గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం పథకాన్ని చేపట్టి ఉంటే లక్ష ఎకరాలకు పైగా నీరందేదని గుర్తు చేశారు.కోయిల్గర్ ప్రాజెక్టు సామర్థ్యం మరో రెండు టీఎంసీలు పెంచాలని మంత్రి ఉత్తమ్‌ను కోరామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. 2014లోపే ఉమ్మడి జిల్లాలో 70 శాతం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, 7 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టును పక్కనపెట్టి, రూ.50 వేల కోట్లతో రీ ఇంజనీరింగ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారని, రూ.30 వేల కోట్లు వెచ్చించినా ఒక్క ఎకరాకు ఈ పథకంతో నీరందలేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే జీఓ నంబరు 69ని గత ప్రభుత్వం పక్కనపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మండిపడ్డారు. పాలమూరులో వలసలు తగ్గలేదు మహబూబ్‌నగర్ అంతా పచ్చగా లేదని, ఇంకా నీటి గోసతో అల్లాడుతుందని మహబూబ్ నగర్లో ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంత్రిని కలిసిన అనంతరం సచివాలయ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వారు మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు చేసిందని శూన్యమని నిప్పులు చెరిగారు. వలసలు తగ్గలేదని..వలపోత ఆగలేదన్నారు. ముంబై బస్సు రావడం ఆగలేదు...పనుల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకా తప్పలేని పరిస్థితి అని ధ్వజమెత్తారు. ఏదో చేశామని చెబుతున్న బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఒక్క పిల్ల కాల్వ నుంచి ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్లు, మాటల మీద పని తప్పా...ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. -
నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో ‘గోదావరి జల దీక్ష’
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను టీపీసీసీ నేతలు శనివారం సందర్శించనున్నారు. వాటి పురోగతి, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ’గోదావరి జల దీక్ష’పై డీసీసీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో గాంధీభవన్ నుంచి ఫోన్ లో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు వారి పరిధులలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి శనివారం దీక్షలు చేయాలని, స్థానిక మీడియాతో మాట్లాడి ప్రాజెక్టు వివరాలు తెలియజేయాలని ఉత్తమ్ పార్టీ నేతలను కోరారు. -
పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేస్తాం
-
నదులతోనే ప్రగతి
ఎచ్చెర్ల క్యాంపస్/రణస్థలం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పూర్వ నాగరికతలన్నీ నదీపరివాహక ప్రాంతాల్లోనే విరాజిల్లాయని, నదుల అనుసంధానంతోనే ప్రగతి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జిల్లాలో వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టు, మహేంద్రతనయపై ఆఫ్‌షోర్ ప్రాజెక్టు వంటి పెండింగ్ పనులన్నీ ఈ ఏడాది లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదికి హారతి ఇచ్చారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12.30 గంటల కు ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం వద్దనున్న హెలిఫ్యాడ్ వద్దకు చేరుకున్నారు. బీఆర్‌ఏయూ వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రామ్‌జీ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్.హరశ్రీరాములు, రిజిస్ట్రార్ కొరుపోలు రఘుబాబు సీఎంకు స్వాగతం పలికారు. చంద్రబాబు అక్కడి నుంచి తమ్మినాయుడుపేట వద్దకు వెళ్లి జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజలు నిర్వహించి నూతన వస్త్రాలను నదిలో విడిచిపెట్టారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమానికి హాజరయ్యారు. తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు పాత కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. టెక్కలి నియోజకవర్గంలో తలపెట్టిన చిన్నసాన ఎత్తిపోతల ప«థకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం వద్ద వెలుగు, మహిళాశిశు సంక్షేమ శాఖ, ఉద్యానవన శాఖ, సూక్ష్మనీటి సేద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. నదీ జలాలు వృథాపోకుండా ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవడంపై ప్రజలను చైతన్యం చేయడానికే జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. మంత్రి కళా విన్నపాల మేరకు రణస్థలం మండలం కొండములగాంలోని సామాజిక ఆస్పత్రి స్థాయిని 30 నుంచి 50 పడకలకు పెంచుతామని హామీ ఇచ్చారు. లావేరు మండలంలోని బుడుమూరు నారాయణ సాగరం చెరువును రూ. 10 కోట్లుతో మినీ రిజర్వాయరుగా మార్చుతామని చెప్పారు. అయితే ఈ హామీని 2014 ఎన్నికల సమయంలోనే కళావెంకటరావు ఇవ్వడం గమనార్హం. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గంలో విస్తరించి ఉన్న ఫార్మా పరిశ్రమలలో యువతకు ఉపాధి కల్పించేలా బీ ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలన్న కళా వినతికి సీఎం సానుకూలంగా స్పందించారు. అయితే రూ.50 కోట్ల నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వంశధార రెండో దశ ప్రాజెక్టు పనుల్లో గత పాలకులు ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నదుల అనుసంధానంతోనే సాగు, తాగునీటి సమస్యలు ఉండబోవని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, జిల్లాపరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మిదేవి, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషా, మాజీ స్పీకరు కావలి ప్రతిభాభారతి, పార్టీ నాయకులు చౌదరి బాబ్జీ, కొండ్రు మురళీ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించారు. అర్ధంతరంగా వెనుదిరిగిన ఎమ్మెల్యే శివాజీ... పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీకి అలక అలంకారమని పేరు. పలు సందర్భాల్లో దాన్ని ప్రదర్శిస్తుంటారు కూడా. శనివారం సీఎం కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. బహిరంగసభ వేదికపైకి కూడా వెళ్లారు. కానీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, టీడీపీ జిల్లా మహిళా నాయకురాలు తమ్మినేని సుజాత వేదికపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. ఇది గమనించిన శివాజీ వేదికపై నుంచి దిగివెళ్లి వారిని వదలాలని కోరారు. కానీ పోలీసులు ససేమిరా అనడంతో శివాజీ అలకబూనారు. ఆయితే సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనతో చెప్పించాలని చూశారు. కానీ సీఎం పట్టించుకోకుండా వేదికపైకి వెళ్లిపోవడంతో శివాజీ చిన్నబుచ్చుకున్నారు. తర్వాత ఎంతమంది నాయకులు వెళ్లి బతిమాలినా వేదికపైకి వెళ్లకుండా అక్కడి నుంచి వెనుదిరిగారు. -
పాలమూరుపై సవతి తల్లి ప్రేమ
కొల్లాపూర్: పాలమూరు జిల్లాపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా సీపీఐ పార్టీ ప్రథమ మహాసభలు సోమవారం కొల్లాపూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో సీపీఐ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజా బంగ్లా ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీశ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో సంఘ్‌పరివార్ శక్తుల హింస ప్రజ్వరిల్లుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. ఇక తెలంగాణలో దొంగల రాజ్యం.. దోపిడీ పాలన కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై లేదన్నారు. మూడేళ్ల క్రితం సీపీఐ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని సీఎంకు లేఖ రాసినా పూర్తి చేయలేదన్నారు. ఆంధ్రోళ్ల పాలనలో మనకు ఉద్యోగాలు వస్తలేవు అన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్.. పంటకు ఎందుకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదో చెప్పాలన్నారు. అమావాస్య చీకటిలో ఉన్నారు.. కమ్యూనిస్టుల పని అయిపోయిందని మోదీ, కేసీఆర్ మాట్లాడుతున్నారని.. ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం కమ్యూనిస్టులు అమావాస్య చీకట్లో ఉన్నారని, త్వరలోనే పున్నమి వెలుగుల్లోకి వస్తామన్నారు. విడిపోయి పడిపోయామని, చీలిపోయి చితికిపోయామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. కమ్యూనిస్టులు ప్రజల గొంతుకగా ఉంటారన్నారు. రాజీలేని పోరాటం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. కమ్యూనిస్టులు ప్రజలపక్షాన పోరాటాలు చేయాలన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఈర్లనర్సింహా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌నర్సింహ ప్రసంగించారు. సభలో నాయకులు ఆనంద్జీ, ఫయాజ్, కేశవులు, వార్ల వెంకటయ్య, కొమ్ము భరత్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
- మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూటి ప్రశ్న కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): అధికారంలోకి రావడానికి మీ తండ్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జిల్లాకు ఇచ్చిన 32 హామీలలో ఓ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఇంత వరకు మొదలే కాలేదన్నారు. పాత పనులకు పైపై మెరుగులు దిద్ది అభివృద్ధి చేస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి ఓట్లు అడగాలని హితవుపలికారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు గతంలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని చేసి తమ నైతికతను చాటుకున్నారనీ, మంత్రుల ముసుగులో తండ్రీ, కొడుకులు చేపట్టిన ప్రచారాన్ని చూసి ప్రజలు మభ్య పడే రోజులు పోయాయన్నారు. అసమ్మతి నాయకులను నామినేటెడ్ పదవులను ఎర చూపుతుండటాన్ని కూడా నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. -
పట్టాలు పడుతున్నాయి
రాష్ట్ర పరిధిలోని రైల్వే లైన్లకు భారీగా నిధులు • మొత్తంగా ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు • సీఎం కలల ప్రాజెక్టు కొత్తపల్లి– మనోహరాబాద్‌కి రూ.350 కోట్లు • బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు రూ.260 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఈ సారి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తగినంత ప్రాధాన్యం లభించింది. పలు పెండింగ్ ప్రాజెక్టులు సహా కొత్త రైల్వే మార్గాలకు సైతం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు అయిన కొత్తపల్లి–మనోహరాబాద్ (కరీంనగర్–హైదరాబాద్) ప్రాజెక్టుకు రూ.350 కోట్లు ఇవ్వడం గమనార్హం. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లను కేటాయించగా.. అందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలును ప్రకటించకున్నా.. కొత్త లైన్ల ఏర్పాటు, ఉన్న లైన్లకు అదనంగా రెండు, మూడు లైన్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం గమనార్హం. కొత్త పంథాలో.. దాదాపు తొమ్మిది దశాబ్దాల ఆనవాయితీని పక్కనపెడుతూ సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేసిన కేంద్రం.. కేటాయింపుల్లోనూ కొత్త పంథా చూపింది. అయితే బడ్జెట్లో రైల్వేకు సంబంధించి ఏయే ప్రాజెక్టులకు ఎన్ని నిధులిచ్చారనే పూర్తి వివరాలను పేర్కొనలేదు. పింక్బుక్గా వ్యవహరించే ఈ పద్దుల వివరాలను శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆ వివరాలను శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆయన వెల్లడించిన ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి మొత్తంగా రూ.5,135 కోట్లను కేటాయించారు. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ నిర్మాణ పనులకు ఎక్కువ నిధులు ఇచ్చారు. బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణానికి రూ.260 కోట్లు, మునీరాబాద్–మహబూబ్‌నగర్ లైన్‌కు రూ.300 కోట్లు, అక్కన్నపేట–మెదక్‌కు రూ.160 కోట్లు కేటాయించారు. దీంతో ఇంతకాలం నత్తనడకన జరుగుతున్న ఈ పనుల్లో వేగం పెరగబోతోంది. సీఎం కలల ప్రాజెక్టుకు రూ.350 కోట్లు తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేట పట్టణాలకు రాజధానితో రైల్వే అనుసంధానం లేదు. సిద్దిపేటకు అసలు రైల్వే మార్గమే లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు రైల్వే లైన్ నిర్మించాలంటూ కేసీఆర్ రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు రైల్వే బడ్జెట్లో చోటు దక్కినా.. ముందుకు సాగలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ గట్టిగా ప్రయత్నించడంతో కదలిక వచ్చింది. గతేడాది ప్రధాని మోదీ స్వయంగా ఈ రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. తాజా బడ్జెట్లో ఏకంగా రూ.350 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ శివార్లలోని మనోహరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త లైన్.. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లల మీదుగా కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు 148.9 కిలోమీటర్లు కొనసాగుతుంది. బల్లార్షా–కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ అత్యంత రద్దీ మార్గంగా పేరున్న బల్లార్షా–కాజీపేట–విజయవాడ మార్గంలో ప్రస్తుతం మూడో లైన్ నిర్మాణం జరుగుతోంది. అది అందుబాటులోకి రావటానికి మరో రెండేళ్లు పట్టనుంది. అయితే ఆ మార్గంలో నాలుగో లైన్ కూడా అవసరమని భావించిన రైల్వే దానికి సర్వే పనులు చేపట్టనుంది. ఇక ఈ ఏడాదితో పూర్తికానున్న పెద్దపల్లి– కరీంనగర్–నిజామాబాద్ (178 కి.మీ.) లైనుకు రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ఏడాదిలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో రైళ్లు పరుగెత్తనున్నాయి. టీకాస్‌కు మరిన్ని నిధులు రైళ్లు ఢీ కొనకుండా అభివృద్ధి చేస్తున్న ‘ట్రెయిన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం (టీకాస్)’ను మరిన్ని చోట్లకు విస్తరించనున్నారు. దీనిని ఇప్పటికే సికింద్రాబాద్– వాడి–వికారాబాద్–బీదర్ సెక్షన్లలో వినియోగి స్తుండగా.. తాజాగా సికింద్రాబాద్– గద్వాల–డోన్– గుంతకల్ మార్గానికి విస్తరించారు. ఇందుకు రూ.120 కోట్లు కేటాయించారు. కొత్త మార్గం ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ (220 కి.మీ). అంచనా వ్యయం రూ.2,800 కోట్లు. (రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టు) రైళ్ల క్రాసింగ్స్ కోసం కొత్త స్టేషన్ల నిర్మాణం: (అంచనా రూ.15 కోట్లు) – వనపర్తి రోడ్డు–కౌకుంట్ల; మానవపాడు–అలంపూర్ రోడ్డు; ఇటిక్యాల–మానవపాడు కొత్త లైన్ల కోసం సర్వే ⇔ బొల్లారం–ముద్ఖేడ్ డబ్లింగ్ (235 కి.మీ) ⇔ కాజీపేట–బల్లార్షా నాలుగో లైన్(234 కి.మీ) ⇔ కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ (219 కి.మీ.) ⇔ మంచిర్యాల–గడ్చిరోలి కొత్త లైన్ (115 కి.మీ.) భద్రతా పరమైన పనులు ⇔ 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు), 7 రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్యూ బీ). అంచనా వ్యయం రూ.941 కోట్లు. రైల్వే వాటా రూ.383 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.558 కోట్లు ⇔ 9 కొత్త వంతెనలకు రూ.31 కోట్లు ⇔ లెవల్ క్రాసింగ్స్, ఇంటర్‌లాకింగ్ పనులకు రూ.69.5 కోట్లు -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
– గత పాలకులు నాగర్‌కర్నూల్‌ను వెనక్కి నెట్టారు – ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుస్తాం – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి కంటే సాగునీరు రావడంతో ఈ ప్రాంతంలోని రైతాంగం అంతకన్న ఎక్కువ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని అన్నారు. మండలంలో కేఎల్ఐ 40వ కిలోమీటరు నుంచి 85వ కిలోమీటరు వరకు పెండింగ్‌లో ఉన్న కాల్వ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ కేఎల్ఐ ద్వారా చెరువులు, కుంటలు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. గత పాలకుల వల్ల నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వెనక్కి నెట్టేయబడిందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా తెలంగాణ సర్కారు ఉంటే జిల్లాలో రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రా నాయకుల పాలనలో ఎన్నికలకు ముందు, తర్వాత ప్రాజెక్టుల వద్ద కొబ్బరికాయలు కొట్టి తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నారని, వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రైతులు సాగునీరు తెచ్చుకునేందుకు తొందరపడి కాల్వ గట్టు, బ్యాంకింగ్‌లను తొలగించవద్దని, నీరు వచ్చే ప్రతి ప్రాంతానికి నీరు తెస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఇరిగేషన్ సీఈ ఖగేందర్, డీఈ లోకిలాల్, ఎస్పీఎం వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, గంగనమోని కిరణ్, మహమూద్‌ఖాన్, సర్పంచ్‌లు సుమలత, జ్యోతి, ఎంపీటీసీలు యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, సరస్వతమ్మ తదితరులు ఉన్నారు కృష్ణమ్మకు పూజలు కేఎల్ఐ మూడవ లిప్టు ద్వారా నింపిన వడ్డెమాన్ భీమా సముద్రం, పాలెం పల్లెకుంటలో మంత్రి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. -
పెండింగ్ ప్రాజెక్టులకు రూ.11వేల కోట్లు
ఇంకా 3 వేల కోట్లు వెచ్చిస్తాం: హరీశ్‌రావు * రైతుల కళ్లలో ఆనందం చూడటమే సర్కార్ ధ్యేయం * సంగంబండ రిజర్వాయర్‌కు నీటి విడుదల మక్తల్: పెండింగ్ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3 వేల కోట్లు వెచ్చించి మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం(సంగంబండ) స్టేజీ-1, స్టేజీ-2లను గురువారం ఆయన ప్రారంభించి సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పాలమూరు ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సంగంబండ రిజర్వాయర్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించి రైతులకు సాగు నీరందిస్తుందని, ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాటిని అధిగమిస్తామన్నారు. ‘సీఎం కేసీఆర్ రైతు బిడ్డ.. రైతుల సంక్షేమం కోసమే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.. ఎన్ని నిధులైనా వెచ్చించి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. విపక్షాల పప్పులుడకవు పాలమూరు- రంగారెడ్డి, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే.. వారి పప్పులు ఉడకవని హరీశ్ చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 18 లక్షల ఎకరాలకు సాగు నీరందించి రైతు కళ్లలో ఆనందం చూడటమే కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా నుంచి లక్షల మంది వలస వెళ్లిన వారు తిరిగి తమ స్వగ్రామాలకు వచ్చి బీడుబారిన పొలాలను సాగు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. గోదాముల అభివృద్ధికి వెయ్యి కోట్లు జిల్లాలోని గోదాముల కోసం ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. రాష్ర్టంలో ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలు 134 మంజూరు చేయగా.. పాల మూరు జిల్లాకు 24 పాఠశాలలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు పల్లకీ మోస్తున్న తెలంగాణ టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డిలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టుల గురించి నోరువిప్పని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు రద్దు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు సంగంబండ రిజర్వాయర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ 2016 జూన్(ఖరీఫ్) నాటికి పూర్తిచేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని, అవి పూర్తయితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుం దని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 13 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టుల పురోగతి, వాటిల్లో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలు తదితరాలపై మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మారథాన్‌లా సమీక్ష జరిగింది. 146, 123 జీవోలను వాడుకుంటూ ముందుకు... కాంట్రాక్టర్లకు అదనపు ధరల చెల్లింపులకు సంబంధించిన జీవో 146, భూసేకరణ జీవో 123లను ఉపయోగించుకోవాలని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. 146 జీవో విడుదలైన నేపథ్యంలో కాంట్రాక్టు ఏజెన్సీలతో మాట్లాడి పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను 146 జీవోను ఉపయోగించుకొని పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1,400 ఎకరాల భూసేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని స్పెషల్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 300 ఎకరాలను నవంబర్ 15 నాటికి సేకరించాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, రాళ్లవాగు, వరంగల్‌లోని దేవాదుల ప్రాజెక్టు, నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, పెండ్లిపాకాల, ఉదయసముద్రం వంటి పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల కింద సైతం భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
మక్తల్: జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని టీ.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కోరారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందితే వ లసలు అరికట్టొచ్చన్నారు. ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదని విమర్శించారు. బుధవారం మక్తల్ మండలంలో సంగంబండ భీమా ప్రాజెక్టు, చి న్నగోప్లాపూర్ సర్జికల్ క్యాంప్‌ను మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ బృందం పరిశీలించింది. ఈ సం దర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తే పాలమూరు సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇక్కడినుంచి గతంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్ జిల్లాపై శ్రద్ధచూపించలేదన్నారు. భీమా ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు మంజూరుచేస్తే పెండింగ్ పనులు పూర్తవడంతోపాటు జిల్లారైతులకు ఎంతోమేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమంకోసం టీడీపీ పనిచేస్తుందన్నారు. సీఎంకు పాలనపై అవగాహన లేదు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్ అహంకారం తగ్గించాలన్నారు. అధికారం చేపట్టి 14నెలలు దాటినా పాలనపై పట్టు సాధించలేదన్నారు. కేసీఆర్‌కు పరిపాలనపై అవగాహన ఎంతమాత్రం లేదన్నారు. కర్ణాటక ప్రభ్వుం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నా కేసీఆర్ నోరుమొదపడం లేదన్నారు. కర్ణాటక బ్యారేజ్కంరోడ్ కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు టీడీపీ వ్యతిరేకం కాదన్నారు. భీమా ఎత్తిపోతలకు రూ.250కోట్లు ఖర్చుచేస్తే ప్రాజె క్టు పూర్తవుతుందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పనులు పూర్తిచేస్తే జిల్లా సస్యశామలం అవుతుందన్నారు. టీడీపీ పాలనలోనే పాలమూరు ప్రాజెక్టులు నిర్మించినట్లు చెప్పారు. అనంతరం నీటిపారుదల శాఖ ఎస్ఈ అజయ్‌కుమార్‌తో ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బృందంలో ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, వివేకానంద్, రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి, రాములు, జర్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సిములు, జిల్లా మాజీ చైర్మన్ జయశ్రీ, టీడీపీ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, ఖానాపూర్ సర్పంచ్ వెంకటయ్యగౌడ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు జి.కిషన్ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై బీజేపీ నిర్వహించిన అవగాహన సదస్సులో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... కృష్ణా, గోదావరిపై పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవుపై ప్రకటన చేయకపోవడం దారుణమని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలో పెండింగ్ ప్రాజెక్టులపై పోరాటం చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు. -
15 వేల కోట్లివ్వండి.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా
ప్రభుత్వానికి నాగం సవాల్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరందేలా చేసి చూపిస్తానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మం త్రి నాగం జనార్దన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం నాగం నేతృత్వం లోని బీజేపీ బృందం పలువురు రిటైర్డ్ ఇంజనీర్లతో కలిసి కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను సందర్శించింది. అనంతరం కరీంనగర్లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి యెన్నం శ్రీని వాస్, జిల్లా అధ్యక్షుడు అర్జున్‌రావు తదితరుల తో కలిసి నాగం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 34 భారీ, 17 మధ్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చేస్తే 46 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చన్నారు. -
రాయలసీమకు అన్యాయం: నాగిరెడ్డి
కర్నూలు: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమకు అధిక నిధులు కేటాయించి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. పట్టిసీమవల్ల రాయలసీమకు ఒరిగేదేమీ లేదని అన్నారు. పట్టిసీమకు ఇచ్చే నిధులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఇస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని నాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
అవినీతిని పారదోలే వరకు నిద్రపోను
చిత్తూరు జిల్లా పలమనేరు నీరు-చెట్టు సభలో సీఎం చంద్రబాబు * నేను అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే.. విపక్షాలు అడ్డుకుంటున్నాయి * పట్టిసీమపై అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్నాయి * తెలంగాణ ప్రభుత్వంతో కలసి తప్పుడు రాజకీయాలు చేస్తున్నాయి * పాసుబుక్కులు మీ-భూమికి అనుసంధానం * ఆధార్‌తోనే ఇక అన్ని సర్టిఫికెట్లు సాక్షి, చిత్తూరు: అవినీతి పెరిగిపోతోందని, దానిని పారదోలేంత వరకు నిద్రపోనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెవెన్యూ మొదలుకుని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పైసా అవినీతి జరగకుండా చూస్తానన్నారు. ప్రజలకు అవినీతి రహితపాలన అందిస్తానని శపథం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శుక్రవారం నిర్వహించిన నీరు-చెట్టు, పొలం పిలుస్తోంది, బడిబాట కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మిదొడ్డి గ్రామంవద్ద కనికల్లు చెరువులో పూడికతీత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగిస్తూ పైవిధంగా పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు అవినీతిని పారదోలుతానంటూ శపథం చేయడం గమనార్హం. పట్టిసీమలో అవినీతి అంటూ ప్రతిపక్షాలు పనిగట్టుకుని గగ్గోలు పెడుతున్నాయని, రాయలసీమకు నీళ్లిచ్చేందుకే దానిని ప్రారంభించినట్లు ఆయనీ సందర్భంగా చెప్పారు. ఆగస్టు నాటికి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి 80 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలిస్తామన్నారు. రాయలసీమకు నీళ్లిస్తే తాము ఉనికి కోల్పోతామని ప్రతిపక్ష పార్టీ పట్టిసీమను వ్యతిరేకిస్తోందని సీఎం ఆరోపించారు. తాను అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే... ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పారు. రాజధానికి ప్రజలు స్వచ్ఛందంగా భూమి ఇస్తుంటే ప్రతిపక్షపార్టీ నేతలు అడ్డుతగులుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమంలా నీరు-చెట్టు.. నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టినట్టు సీఎం చెప్పారు. చెరువుల్లో పూడికతీసి భూగర్భ జలాలు పెంపొందించడమే లక్ష్యమన్నారు. రూ.100కే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. రైతులు పాసుపుస్తకాలకోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకే మీ-భూమి వెబ్‌సైట్‌ను తెస్తున్నామని చెప్పారు. అధికారులు ఇక ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పారు. అనంతరం పలమనేరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విజయవాడకు చెందిన ఏ ఫైలైనా వారంలో పరిష్కారం తన పేషీ అధికారులకు సూచించానన్న సీఎం.. సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడకు సంబంధించిన ఏ ఫైలునైనా వారంరోజుల్లో క్లియర్ చేయాలని తన పేషీ అధికారులకు సూచించానని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారమిక్కడ విజయవాడలో తన క్యాంపు కార్యాలయం ఆవరణలో బస్సులోనే కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. విజయవాడ నగర సుందరీకరణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. త్వరలో బెంజిసర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డంకులు తొలగుతాయని చెప్పారు. గుంటూరు, విజయవాడతోపాటు రాజధాని అమరావతికి చెత్తవల్ల ఇబ్బందుల్లేకుండా చేస్తామని తెలిపారు. పోలవరం కుడికాలువ నిర్మాణంవల్ల భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమై వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్గా రూ.700 కోట్లు ఇస్తామని హామీఇచ్చారు. పామాయిల్ చెట్టుకు రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పొగాకు రైతులు, బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ రైతుల సమస్యలు పట్టించుకోకపోతే పొగాకు బోర్డు ఎందుకంటూ.. ఒప్పందాల ప్రకారం కొనుగోళ్లు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. -
'చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా నుంచి సాగు, తాగు నీరు'
తిరుపతి: ఈ ఏడాది నవంబర్ 20 నాటికి చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం పెండింగ్ ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో బాబు సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ ల పురోగతి కోసం ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అవసరమైతే 15 రోజులకొకసారి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తానన్నారు. 2016 వ సంవత్సరం మార్చి నెలకు గాలేరు-నగరి పనులు పూర్తి చేస్తామని బాబు తెలిపారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: మల్లు రవి
మహబూబ్‌నగర్ (జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతులకు సాగు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన 'సాక్షి'తో ఫోన్లో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.35,200 కోట్లు కేటాయించి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోందన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తే.. జిల్లా వ్యాప్తంగా 8.50 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు సాగునీరందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని మల్లు రవి ఆరోపించారు. -
కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా
పాములపాడు/ జూపాడుబంగ్లా : ప్రాజెక్టుల వద్ద నిద్రించి వాటిని సకాలంలో పూర్తి చేయించి రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బుధవారం ఆయన బానకచర్ల నీటినియంత్రణ సముదాయాన్ని పరిశీలించారు. ఉదయం 11.40నిమిషాలకు హెలిపాడ్ వద్ద దిగి నేరుగా తెలుగుగంగ కాల్వ, కేసీ ఎస్కేప్, ఎస్సార్బీసీలను పరిశీలించారు. కాల్వల స్థితిగతులను నీటిపారుదలశాఖ సీఈ చిట్టిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫొటోఎగ్జిబిషన్ తిలకించి పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని ఏయే కాల్వలకు సరఫరా చేస్తారో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కాల్వల విస్తరణ జరగ నందున పూర్తిస్థాయిలో నీటిని దిగువప్రాంతాలకు తరలించుకెళ్లే అవకాశం లేదన్నారు. ఎస్సార్బీసీపై మరో హెడ్‌రెగ్యులేటరు నిర్మించి గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లకు 19 టీఎంసీల నీటిని తరలించు కెళ్లాల్సి ఉందన్నారు. పనులు చేయకుండా తమాషా చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టి మరొకరి చేత పనులు చేయిస్తామని తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి తక్కువ సాగునీటితో అధికదిగుబడులు సాధించేందుకు కృషిచేయాలని సూచించారు. ముచ్చుమర్రి, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తిచేయిస్తానని హామీనిచ్చారు. ఆలస్యంగా సీఎం రాక.. బానకచర్ల నీటినియంత్రణ సముదాయం వద్దకు ఉదయం 9.45 నిమిషాలకు సీఎం రావాల్సి ఉంది. అయితే రెండుగంటలు ఆలస్యంగా 11.45నిమిషాలకు సీఎం వచ్చారు. హెలిపాడ్ వద్ద వీఐపీలకు సేమియానా, తాగునీరు.. వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో ఎండతీవ్రతకు వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీఎం సభ సైడ్‌లైట్స్ ► ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్న హెలికాప్టర్ హెలిపాడ్ చేరే సందర్భంలో బహిరంగ సభలో కుర్చీల్లో కూర్చొన్న ప్రజలంతా అక్కడి చేరుకున్నారు. దీంతో సభలో కుర్చీలు ఖాళీగా కన్పించాయి. ► సీఎం బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న తరుణంలో సభలో ఉన్న కొందరు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ జెండాలను ప్రదర్శించి ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ► బహిరంగ సమావేశం జరుగుతుండగా హెలిపాడ్ నుంచి ెహ లికాప్టర్ ఎగరడంతో జనాల దృష్టి ఒక్కసారిగా అక్కడికి మళ్లింది. ► సభ ప్రారంభం కాగానే అధ్యక్ష స్థానంలో బీసీ జనార్దన్‌రెడ్డి నియోజక వర్గ సమస్యలపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ► బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి నీరు- చెట్టు ద్వారా గ్రామాల్లో ఏం పనులు చే శారంటూ సభలోని వ్యక్తులకు మైకు ఇచ్చి వారితో మాట్లాడించారు. ► రుణాలు సక్రమంగా చెల్లించినా బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడం లేదని, సక్రమంగా రుణాలు చెల్లించిన గ్రూపులను, చెల్లించని గ్రూపులను బ్యాంకర్లు ఒకే విధంగా చూస్తూ రుణాలు ఇవ్వడం లేదని పొదుపు మహిళలు సీఎం దృష్టికి తెచ్చారు. ► మహిళలు మాట్లాడేందుకు ముందుకు రావాలని బహిరంగ సమావేశంలో మహిళలను వెనుకవైపు కూర్చొబెట్టారని, వారికి ముందు సీట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ► కొందరు భక్తులు అయ్యప్పమాల, భవానీ మాలలు వే స్తున్నట్లుగానే తాను జలదీక్ష చేపట్టానని సీఎం ప్రకటించారు. ► చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని, తెలివితేటలు పెరుగుతాయని, చేపల పెంపకానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని సీఎం అన్నారు. -
ఎవరి మెప్పు కోసమో!
సాక్షి ప్రతినిధి, కడప : చెప్పేందుకే శ్రీరంగ నీతులు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. కొద్ది పాటి నిధులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వెనుకాడుతూ రాజకీయ ఉన్నతి కోసం రాజ్యాంగ విలువలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. జూలై నాటికి మైలవరం, గండికోట ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని జిల్లా పర్యటనలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. హైదరాబాద్‌కు వెళ్లాక ఆ హామీని మర్చిపోయినట్లు ఉన్నారనే వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్లో జీఎన్ఎస్ఎస్కు కేటాయించిన నిధులే ఇందుకు నిదర్శనమని పలువురు వివరిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆరోపణల సుడిగుండం నుంచి తప్పించుకుంటూ.. స్వలాభం చూసుకుందామని ‘పట్టిసీమ’ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా పులివెందులకు నీరు తెస్తామని టీడీపీ నేతలు సెలవిస్తున్నారు. వీరి వాదనలు ఏ విధంగా సాధ్యమో అర్థం కావడం లేదని సాగునీటి రంగ నిపుణులు వాపోతున్నారు. పట్టిసీమ నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి, శ్రీశైలం ద్వారా రాయలసీమకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ నేతలూ అదే వాదనను భుజానికెత్తుకున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాల గురించి పరిశీలించకుండానే పులివెందులకు నీరొస్తుందంటూ ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌రెడ్డి తాజాగా సోమవారం పులివెందులలో ఏకంగా ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశమైంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల కనీస నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వడం సాధ్యమనే వాస్తవాన్ని ‘కళ్లుండి చూడలేని దుస్థితి’లో అధికార పార్టీ నేతలు ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ప్రభుత్వం మొన్నటి దాకా నీరు తీసుకెళ్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వీరు ఈ ప్రాంతానికి యోగ్యకరమైన చర్యల్ని విస్మరించి, ఎలాంటి అదనపు ప్రయోజనం లేని పట్టిసీమ కోసం రచ్చ చేయడం సరైంది కాదంటున్నారు. అధినేత మెప్పు కోసమే ర్యాలీ.. ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌రెడ్డి శాసన మండలి డిప్యూటీ చైర్మన్. జిల్లా వాసికి మండలిలో ఉన్నత స్థానం లభించడంతో జిల్లాభివృద్ధికి తోడ్పాటుగా ఉంటుందని అభివృద్ధి కోరుకునేవారంతా భావించారు. అభివృద్ధి అటుంచితే అధినేత మెప్పు కోసమే ఆయన చర్యలు ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన స్థాయిని మరిచి గల్లీ సవాళ్లు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందులలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీ నిర్వహిస్తే, అధినేత వద్ద మార్కులు దక్కుతాయనే ఎత్తుగడతోనే సోమవారం సాయంత్రం నాటి కార్యక్రమని పలువురు విశదపరుస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యూహత్మకంగా రాజ్యాంగ హోదాను సైతం మరిచి వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయనకు ఈ ప్రాంతం పట్ల నిజంగా ప్రేమ ఉంటే.. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా జూలై నాటికి జిల్లాలో గండికోట, మైలవరం రిజర్వాయర్లుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా (1995-2004) తొమ్మిదేళ్ల పాలనా కాలంలో సాగు నీటి ప్రాజెక్టుల్ని పూర్తిగా విస్మరించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు రూపొందించారు. ఈ పథకానికి తొమ్మిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేవలం రూ.17 కోట్లు వెచ్చించారు. తీవ్ర దుర్భిక్షం తాండవిస్తోన్న పులివెందుల ప్రజలకు యోగ్యమైన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సిబిఆర్)కు సైతం రూ.10 కోట్లు ఖర్చు చేశారు. వెలిగల్లు ప్రాజెక్టుకు రూ.7.19 కోట్లు ఖర్చు చేయగా, తెలుగుగంగ ప్రాజెక్టుకు మాత్రమే రూ.198.7 కోట్లు వెచ్చించారు. జిల్లా ప్రాజెక్టుల కోసం వాస్తవంగా చంద్రబాబు కేటాయించిన నిధులివి. వాస్తవమిలా ఉంటే తమ వల్లే నీరు వచ్చిందని, అభివృద్ధి అంతా తామే చేశామని టీడీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. -
'సీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లకు అధిక నిధులు ఇవ్వాలి'1
-
'సీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లకు అధిక నిధులు ఇవ్వాలి'
తిరుపతి: ఏపీ బడ్జెట్లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లకు అధిక నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెండింగ్ ప్రాజెక్ట్‌లకు 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం 10 శాతం నిధులు కేటాయించిన హంద్రీనివా, గాలేరు నగరి పూర్తవుతాయని తెలిపారు. నిధుల సాధన కోం వైఎస్ జగన్ నేతృత్వంలో అవసరమైతే అసెంబ్లీని స్తంభింపచేస్తామన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతుల పక్షాన అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్బంగా స్పష్టం చేశారు. -
‘కూత’లేనా!
ఏలూరు/తాడేపల్లిగూడెం : కేంద్ర రైల్వే బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌గా ప్రకటిస్తారా, మన జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు ఇస్తారా.. ఎప్పటిలా ఉసూరుమనిపిస్తారా అనేది కొద్దిగంటల్లోనే తేలిపోనుంది. ఎంపీలు మాత్రం జిల్లాలోని రైల్వే సమస్యలను, అవసరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఈసారి సానుకూల స్పందన ఉంటుం దని చెబుతున్నారు. వీటికి మోక్షం కలిగేనా.. ఏటా రైల్వే బడ్జెట్లో జిల్లా ప్రజలకు మొండిచెయ్యే దక్కుతోంది. రాకపోకలు, సరుకుల రవాణా ద్వారా రైల్వేకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం జిల్లా నుంచి సమకూరుతోంది. అయినా ఏ స్టేషన్లో చూసినా అక్కడి సౌకర్యాలు ప్రయాణికులను అసహనానికి గురి చేస్తున్నాయి. కొవ్వూరు-భద్రాచలం మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా నలుగుతోంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.745 కోట్లకు చేరింది. ఈ ైరె ల్వే లైను పూర్తయితే కొత్తగూడెం, సింగరేణి, మణుగూరు బొగ్గు గనుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సింహాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు బొగ్గు తరలించడానికి ఉపయోగపడుతుంది. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ ప్రతిపాదన దశలోనే ఉంది. భీమవరం-నిడదవోలు-గుడివాడ బ్రాంచి లైన్ డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హాల్ట్‌ల సంగతేంటో.. ఏలూరు ైరె ల్వేస్టేషన్‌లో కోరమాండల్, గౌహతి, కరియ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ లేదు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. తాడేపల్లిగూడెంస్టేషన్లో 1, 2 ప్లాట్‌ఫారాలకు లిఫ్టు సౌకర్యం కల్పించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది. ఇక్కడి ఫుట్ బ్రిడ్జిని మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు విస్తరిం చే ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. కాకినాడ నుంచి భావనగర్ మధ్య ప్రతి గురువారం నడిచే రైలు, విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (స్వర్ణజయంతి), దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్, విశాఖ పట్నం-కొల్లాం తదితర రైళ్లకు హాల్ట్ ఇవ్వడం లేదు. నరసాపురం నుంచి రోజుకు 23 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా ఒక్కటే ప్లాట్‌ఫాం ఉంది. ఒక్కటే ఫిట్‌లైన్ ఉండటంతో స్టేషన్‌కు వచ్చి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణ కోసం మచిలీపట్నం పంపించాల్సి వస్తోంది. ఎక్స్‌ప్రెస్‌లు నిలిపేలా చర్యలు విశాఖపట్నం వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలపాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ఈ డిమాండ్ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఎస్కలేటర్ ఏర్పాటుకు కృషి చేస్తాం. - మాగంటి బాబు, ఏలూరు ఎంపీ సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చాం జిల్లాలోని రైల్వే సమస్యలకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చాం. ఈ సారైనా వాటికి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నాం. వైజాగ్‌ను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని, విజయవాడ, రాజ మండ్రి వైజాగ్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు నడపాలని కోరాం. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం రైల్వే స్టేసన్లలో సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు వివిధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడపాలని కోరాం. కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం వంటి అంశాలనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. - తోట సీతారామలక్ష్మి, రాజ్యసభ సభ్యులు దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి జిల్లాలో దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన ప్రాజెక్ట్‌లు, సమస్యలపై ప్రతిపాదనలు ఇచ్చాం. బ్రాంచిలైన్ డబ్లింగ్ పనులు, విద్యుదీకరణతో పాటు భీమవరం, పాలకొల్లు రైల్వేగేట్ల వద్ద ఓవర్ బ్రడ్జిల నిర్మాణానికి నిధులు కేటాయించాలని అడిగాం. బడ్జెట్లో వాటికి స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాం. - గోకరాజు గంగరాజు, నరసాపురం ఎంపీ -
‘ప్రభు’వు కరుణించేనా?
రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఈ సారైనా ప్రాధాన్యత దక్కేనా..? రైల్వే మంత్రి సురేష్ ప్రభు దక్షిణ రైల్వేను కరుణించేనా?.. పెండింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?.. అని తమిళనాడు రాష్ర్ట ప్రజలు ఆలోచనల్లో పడిపోయారు. రైల్వే బడ్జెట్‌ను గురువారం పార్లమెం టులో ప్రవేశపెట్టనుండడమే ఇందుకు కారణం. చెన్నై, సాక్షి ప్రతినిధి :కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఏడాది అప్పటి రైల్వేమంత్రి సదానంద గౌడ మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో కొత్త రైళ్లు పరుగులెట్టాలని, కొత్త మార్గాల రూపకల్పన సాగాలని, మరిన్ని సౌకర్యాలు కలగాలని ప్రయాణికులు ఆశించడం సహజం. కొత్త బడ్జెట్లో ప్రధానంగా తక్కువ ఖర్చుతో ఏసీలో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లుగా ఒక చల్లని వార్త ప్రచారంలో ఉంది. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాలు ఏనాడో అటకెక్కేశాయి. గత మధ్యంతర బడ్జెట్లో తమిళనాడుకు రెండు కొత్త రైళ్లు, అనేక పథకాలను ప్రకటించారు. వీటిలో చెన్నై-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ హామీకే పరిమితమైంది. తిరుచ్చీ-నాగర్‌కోవిల్, చెంగల్పట్టు-దిండుగల్లు డబుల్‌లైన్ పనులు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. చెన్నై- కన్యాకుమారీ డబుల్‌లైన్ పనులు పదేళ్లుగా సాగుతున్నాయి. నిధుల్లేమి వల్లనే నత్తనడకలా పనులు నిర్వహిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జ్ నడుమ 5, 6వ లైన్ల విస్తరణ పనులకు సైతం నిధుల గ్రహణం పట్టుకోవడంతో పనుల్లో వేగం కొరవడింది. రైల్వే బడ్జెట్లో ప్రస్తావించడమేగానీ, నిధులు మంజూరు చేయకపోవడంతో రాష్ట్రానికి సంబంధించి సుమారు 24 పథకాలు బుట్టదాఖలయ్యాయి రాయపురం వరం దక్కేనా రైల్వే బడ్జెట్ అనగానే రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఎదురుచూసేది రాయపురం రైల్వేస్టేషన్ వైభవం. దక్షిణాది రాష్ట్రాల్లోకే ప్రథమంగా బ్రిటిషు దొరలు రాయపురం రైల్వేస్టేషన్‌ను 1856లో నిర్మించగా అదే ఏడాది అక్కడి నుంచి తొలిరైలు పట్టాలపై పరుగులెట్టింది. 1873లో సెంట్రల్ రైల్వేస్టేషన్లో సేవలు ప్రారంభం కాగా 1959, 1998లో మరింతగా విస్తరించారు. 1922 వరకు రాయపురం నుండే రైల్వేసేవలు అందగా, ఎగ్మూర్‌లో మరో రైల్వేస్టేషన్ నిర్మించి అదే ఏడాది రాయపురం ైరె ల్వేస్టేషన్ కార్యకలాపాలను బదలాయించారు. ఈ మార్పులో రాయపురం రైల్వేస్టేషన్ కేవలం లోకల్రైళ్లకే పరిమితమైంది. సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల సంఖ్య ప్రయాణికుల రద్దీ, పెరిగిపోవడంతో అందరి దృష్టి మరలా రాయపురం రైల్వేస్టేషన్‌పై పడింది. చెన్నైలో మూడో రైల్వేస్టేషన్‌గా రాయపురం రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దాలని 2005లో తమిళనాడుకు చెందిన అప్పటి రైల్వేమంత్రి వేలు నిర్ణయించారు. అనేక ఇబ్బందులు ఎదురైన దృష్ట్యా ఇది అంతసులువు కాదని తేలడంతో పక్కనపెట్టేశారు. ఈ విషయమై ఇటీవల చెన్నైకి వచ్చిన రైల్వే మంత్రి సురేష్ ప్రభును మీడియా ప్రశ్నించగా సర్వే సాగుతోంది, పరిశీలిస్తున్నామని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఈ రైల్వే బడ్జెట్లోనైనా రాష్ట్రానికి ప్రాధాన్యం ఏర్పడుతుందోలేదో వేచిచూడాలి మరి?. -
కరుణించు ప్రభూ
నేడు రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి సురేష్‌ప్రభు కొత్తజోన్పై ఆశలు చిగురింపజేసేనా రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా పెండింగ్ ప్రాజెక్టుల మాటేమిటి జన సాధారణ రైలుపై సామాన్యుల ఆశ కొత్త బడ్జెట్‌పై కోటి ఆకాంక్షలు రైల్లే బడ్జెట్ మరి కాస్సేపట్లో వెల్లడికానుంది..ఏ వరాలను కురిపిస్తుందో..ఏ ఆకాంక్షలను నెరవేరుస్తుందో..దీర్ఘకాలిక డిమాండ్లపై కదిలిక ఉంటుందా..ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న రైల్వే జోనుపై కీలక ప్రకటన వెలువడుతుందా..తూర్పు కోస్తా పరిధిలో నలిగిపోతున్న విశాఖకు విముక్తి ప్రసాదిస్తుందా..ఆదాయాన్ని ఆర్జించినా ఎలాంటి వసతులకూ నోచుకోని వాల్తేరు డివిజనుపై కరుణ చూపుతుందా..కాశీ వెళ్లాలంటే ఇక్కట్లు పడుతూ రెండు మూడు రైళ్లు ఎక్కే పరిస్థితి మారుతుందా.. అరచేతిలో వైకుంఠం చూపుతున్న భారతీయ జనతా పార్టీ నేతల హామీ నెరవేరుతుందా..కొత్త రాజధానిగా అవతరించనున్న విజయవాడ వెళ్లాలంటే రత్నాచల్ తప్ప దారిలేని దుస్థితికి తెరదించుతుందా..తిరుమల వెంకన్న దర్శనానికి దారి చూపుతుందా..వారానికోసారొచ్చే రైళ్లు రెగ్యులర్ బాట పట్టేనా.. నేటి రైల్వే బడ్జెట్లో ఏముందోనని విశాఖ ప్రజలంతా కోటి కాంక్షలతో ఎదురు చూస్తున్నారు.. రైల్వేమంత్రి ప్రభు దయ చూపుతారని ఆశిస్తున్నారు.