కరుణించు ప్రభూ
నేడు రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి సురేష్‌ప్రభు
కొత్తజోన్‌పై ఆశలు చిగురింపజేసేనా
రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా
పెండింగ్ ప్రాజెక్టుల మాటేమిటి
జన సాధారణ రైలుపై సామాన్యుల ఆశ
కొత్త బడ్జెట్‌పై కోటి ఆకాంక్షలు
రైల్లే బడ్జెట్ మరి కాస్సేపట్లో వెల్లడికానుంది..ఏ వరాలను కురిపిస్తుందో..ఏ ఆకాంక్షలను నెరవేరుస్తుందో..దీర్ఘకాలిక డిమాండ్లపై కదిలిక ఉంటుందా..ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న రైల్వే జోనుపై కీలక ప్రకటన వెలువడుతుందా..తూర్పు కోస్తా పరిధిలో నలిగిపోతున్న విశాఖకు విముక్తి ప్రసాదిస్తుందా..ఆదాయాన్ని ఆర్జించినా ఎలాంటి వసతులకూ నోచుకోని వాల్తేరు డివిజనుపై కరుణ చూపుతుందా..కాశీ వెళ్లాలంటే ఇక్కట్లు పడుతూ రెండు మూడు రైళ్లు ఎక్కే పరిస్థితి మారుతుందా..
అరచేతిలో వైకుంఠం చూపుతున్న భారతీయ జనతా పార్టీ నేతల హామీ నెరవేరుతుందా..కొత్త రాజధానిగా అవతరించనున్న విజయవాడ వెళ్లాలంటే రత్నాచల్ తప్ప దారిలేని దుస్థితికి తెరదించుతుందా..తిరుమల వెంకన్న దర్శనానికి దారి చూపుతుందా..వారానికోసారొచ్చే రైళ్లు రెగ్యులర్ బాట పట్టేనా.. నేటి రైల్వే బడ్జెట్లో ఏముందోనని విశాఖ ప్రజలంతా కోటి కాంక్షలతో ఎదురు చూస్తున్నారు.. రైల్వేమంత్రి ప్రభు దయ చూపుతారని ఆశిస్తున్నారు.