తిరుపతి: ఈ ఏడాది నవంబర్ 20 నాటికి చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం పెండింగ్ ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో బాబు సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ ల పురోగతి కోసం ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అవసరమైతే 15 రోజులకొకసారి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తానన్నారు. 2016 వ సంవత్సరం మార్చి నెలకు గాలేరు-నగరి పనులు పూర్తి చేస్తామని బాబు తెలిపారు.