ఏపీ బడ్జెట్లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్లకు అధిక నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతి: ఏపీ బడ్జెట్లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్లకు అధిక నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెండింగ్ ప్రాజెక్ట్లకు 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం 10 శాతం నిధులు కేటాయించిన హంద్రీనివా, గాలేరు నగరి పూర్తవుతాయని తెలిపారు. నిధుల సాధన కోం వైఎస్ జగన్ నేతృత్వంలో అవసరమైతే అసెంబ్లీని స్తంభింపచేస్తామన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతుల పక్షాన అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్బంగా స్పష్టం చేశారు.