
సాక్షి, తిరుపతి: ఫిబ్రవరి 3న అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంతం ఎన్నికల శంఖారావం సభ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. రాయలసీమలో 50 స్థానాలు గెలుపే లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సోమవారం రాయలసీమ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రి రోజాతోపాటు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
రాబోయే వారంరోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్‌కు జన సమీకరణకు ఎలా సన్నద్ధం కావాలి అనే దానిపై చర్చించారు. నాన్‌లోకల్ పొలిటీషియన్లను ప్రజలే హైదరాబాద్ ప్యాక్ చేస్తారని అన్నారు. చంద్రబాబు మతితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్‌కు పరాకాష్ట అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. షర్మిల వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్.. స్రిప్ట్ చంద్రబాబుదని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ పెట్టి.. కాంగ్రెస్‌లో కలిపిన షర్మిలకు క్రెడిబులిటీ లేదని విమర్శించారు.
పచ్చమీడియా వైఎస్సార్‌సీపీలో గొడవలు పెట్టడమే పనిగాపెట్టుకుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడిన ఉంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు.. తమ పార్టీ గురించి మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు.
చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment