పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి | pending projects completed properly, demands kishan reddy | Sakshi
Sakshi News home page

పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి

Published Thu, Aug 6 2015 12:52 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

pending projects completed properly, demands kishan reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు జి.కిషన్ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై బీజేపీ నిర్వహించిన అవగాహన సదస్సులో కిషన్రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... కృష్ణా, గోదావరిపై పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవుపై ప్రకటన చేయకపోవడం దారుణమని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలో పెండింగ్ ప్రాజెక్టులపై పోరాటం చేయనున్నట్లు కిషన్రెడ్డి వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement