సుచరితకు మద్దతు తెలపాలని కోరుతున్నాం: ఎల్.రమణ | we support to sucharitha reddy, says L Ramana | Sakshi
Sakshi News home page

సుచరితకు మద్దతు తెలపాలని కోరుతున్నాం: ఎల్.రమణ

Published Sun, Apr 24 2016 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

we support to sucharitha reddy, says L Ramana

హైదరాబాద్ : గత సాంప్రదాయాలను అనుసరించి ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆదివారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే... ఆ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని గతంలో ప్రతిపాదనను తీసుకువచ్చింది...  టీడీపీనే అని ఆయన గుర్తు చేశారు.

పాలేరు ఉప ఎన్నికఓ పోటీ చేయొద్దని అనేక సార్లు టీపీసీసీ నేతలు ఉత్తమ్, భట్టి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్రెడ్డి భార్య సుచరితకు మద్దత తెలుపుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సుచరితకు మద్దతు ఇవ్వాలనీ ఎల్.రమణ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement