తిరోగమనంలో తెలంగాణ: రమణ
తిరోగమనంలో తెలంగాణ: రమణ
Published Fri, Nov 11 2016 2:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
కోదాడ, అర్బన్: టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందక పోగా తిరోగమనంలో పయనిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. నకిలీ విత్తనాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
Advertisement
Advertisement