ఈ ఏడాది జిల్లాలో వైఎస్సార్‌సీపీ, ఎంఐఎంలు తమ ఉనికిని చాటుకునే కార్యక్రమాలు చేపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటించడం ప్రాథమిక, పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చింది. అలాగే ఎంఐఎం అగ్రనాయకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీ పలు కార్యక్రమాలలో పాల్గొంటూ జిల్లాకు అధిక సమయం కేటాయించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లాలో బలమైన పార్టీగా ఎదిగెందుకు ప్రయత్నించింది. పంచాయతీ ఎన్నికల్లో 14 గ్రామాల్లో జెండా ఎగురవేసింది.
సహకార సంఘాల ఎన్నికల్లో కూడా పది సంఘాల్లో విజయం సాధించింది. తృ టిలో డీసీఎంఎస్ చైర్మన్ పదవిని పొగొట్టుకుంది. - వైఎస్సాఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో ఆమె పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మధుశేఖర్ ఈ ఏడాదిలోనే బాధ్యతలను స్వీకరించారు.
బోధన్, నిజామాబాద్, కామారెడ్డి తదితర నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమ ఉనికి నిలుపుకునేందుకు ఎంఐఎం ప్రయత్నం చేసింది. పార్టీ రాష్ట్ర నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లో ఒక గ్రామంలో విజయం సాధించింది.
నిజామాబాద్, బోధన్‌లలో జరిగిన బహిరంగసభలకు ఆ పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్‌ఓవైసీ, అక్బరుద్దీన్‌ఓవైసీలు హాజరయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్న సంకేతాలను ఎంఐఎం ఇవ్వగలిగింది.
ఉనికిని చాటుకున్న వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం..
Published Thu, Dec 26 2013 3:43 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement