'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు' | congress party contest alone in ghmc polls, says digvijay singh | Sakshi
Sakshi News home page

'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు'

Published Sun, Nov 23 2014 6:26 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు' - Sakshi

'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు'

హైదరాబాద్: మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా ఎంఐఎం పోటీ చేయబోతోందని అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని డివిజన్లలో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ మొదటి నుంచి మతతత్వ శక్తులతో శక్తులతో పోరాడుతూనే ఉందని దిగ్విజయ్ గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement