హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ స్థానానికి మహిళా అభ్యర్థని రంగంలో దింపేందుకు మజ్లిస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండటంతో ఈ స్థానం ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారిగా నగర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళకు అవకాశం ఇచ్చేందుకు మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని జాతీయ కరాటే చాంపియన్‌ను సాధించిన సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. మూడేళ్ల క్రితమే సయ్యదా ఫలక్ మజ్లిస్ పారీ్టలో చేరారు. పార్లమెంట్‌లో ముస్లిం గొంతుకగా అసదుద్దీన్ ప్రజా అంశాలను లేవనెత్తే ఏకైక నాయకుడు’ అంటూ కొనియాడి పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు ఆమె.
ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌తో దేవబంద్, ఢిల్లీ, షాహీన్‌న్‌బాగ్‌లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఫలక్ అభ్యరి్థత్వం వైపు మజ్లిస్ మొగ్గు చూపి ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment