ఈ ఎంపీ స్థానంపై అందరి గురి
సై అంటున్న మజ్లిసేతర పార్టీలు
ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఖరారు
ఎంబీటీ అభ్యర్థి కూడా దాదాపు ఖరారు
బీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తులో భాగంగా బరిలోకి బీఎస్‌పీ..
హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ ఏకపక్షమే అని చెప్పొచ్చు. ముస్లింలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎంఐఎందే ఆధిపత్యం. గతంలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే..మజ్లిస్ పార్టీ అభ్యరి్థకి బీజేపీ అభ్యర్థికి మాత్రమే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండనుంది. మజ్లిస్ పార్టీ ఇక్కడి నుంచి ఈజీగా విజయం సాధిస్తామని అనుకుంటున్నప్పటికీ..రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఎస్‌పీ, ఎంబీటీ పారీ్టలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
► తాజాగా తెరపైకి బీఎస్‌పీ వచ్చింది. ఎన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నా తమ విజయాన్ని ఆపలేరని మజ్లిస్ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల పొత్తులో భాగంగా తమకు దక్కిన హైదరాబాద్ స్థానాన్ని వదులుకోమని బీఎస్‌పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నందున తమ పారీ్టకి ఆదరణ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
► ఇక ప్రధాన పోటీ మజ్లిస్, బీజేపీల మధ్యనే ఉన్నప్పటికీ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ గాలివీస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థి బరిలో ఉంటారని భావిస్తున్నారు. అలీ మస్కతీని కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దింపే చాన్స్ ఉందని పార్టీ వర్గాల సమాచారం.
► బీజేపీ అధిష్టానం ఇక్కడ మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ నుంచి మాధవీలత పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే పలు ఆధ్యాతి్మక కార్యక్రమాలతో పాతబస్తీ ప్రజలకు సుపరిచితులయ్యారు. మంచి వాగ్ధాటితో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆమె గట్టి పోటీ ఇవ్వొచ్చనే టాక్ వినపడుతోంది.
► గతంలో మజ్లిస్ పారీ్టతో దోస్తానా కొనసాగించిన బీఆర్‌ఎస్..ఇక్కడ ఓ డమ్మీ అభ్యర్థని ఎన్నికల బరిలోకి దింపేది. మజ్లిస్ పార్టీ ఆదేశాల మేరకు నామ్‌కేవాస్తేగా వ్యవహరించేది. అయితే ఈసారి అలా జరగదని ఆ పార్టీ అధిష్టానం చెబుతోంది. పొత్తులో భాగంగా బీఎస్‌పీకి ఈ స్థానం కేటాయించినందున అనివార్యంగా బీఆర్‌ఎస్ నేతలు కూడా మజ్లిస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుంది.
► ఇక ముస్లిం వర్గానికే చెందిన ఎంబీటీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఎంఐఎంకు పోటీగా ఇక్కడ ఎంబీటీ నుంచి ఆ పార్టీ అధికారప్రతినిధి అంజదుల్లాఖాన్ పోటీ చేస్తారని తెలుస్తోంది.
బీఎస్‌పీ నుంచి చాట్ల చిరంజీవి?
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్‌పీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దిగడానికి చాట్ల చిరంజీవి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎస్‌పీ హైదరాబాద్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న చాట్ల చిరంజీవి వృత్తిరీత్యా న్యాయవాది. బీఎస్‌పీ చీఫ్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు అత్యంత ప్రియ శిష్యుడు కూడా. ఏడేళ్లుగా పారీ్టలో ఉన్నందున చిరంజీవికి పోటీ చేసే చాన్స్ లభిస్తుందని అంటున్నారు. ఆరి్థక, కొన్ని సాంకేతిక కారణాలు ఎదురైతే మాత్రం ఆయన స్థానంలో కాస్త ఆరి్థకంగా బలంగా ఉ న్న బీసీ అభ్యరి్థని ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment