సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయనే వార్తల నేపథ్యంలో క్షేత్రస్థాయిపై బీజేపీ దృష్టి సారించింది. తొలుత గ్రామపంచాయతీ, ఆ తర్వాత జిల్లా, మండల పరిషత్‌లకు, ఈ ఏడాది చివర్లోగా మున్సిపాలి టీలు, కార్పొరేషన్లకు వరుసగా ఎన్నికలు జరుగు తాయి. అయితే గ్రామస్థాయిలో వార్డు సభ్యులు, మొదలుకొని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీ సీలు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ఇలా ప్రతి చోట అభ్యర్థి ఎంపికనే కీలకం.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీకి పడిన ఓట్లు, ఆయా పోలింగ్ బూత్‌లలో బీజేపీకి పోలైన ఓట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై పూర్తిస్థాయి దృష్టి పెడతారని పార్టీవర్గాల సమాచారం. కొంతకాలంగా పార్టీ కోసం పనిచే స్తుండడంతోపాటు, ప్రజల్లో ఉన్న గుర్తింపు, వివిధ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నా లు, ఆయా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సాధించిన ఓట్లు ప్రామాణికంగా మారనున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి, వివిధ వర్గాల ఓట్ల సాధనకు ఏ మేరకు సఫలమయ్యా రనే దాని ప్రాతిపదికన స్థానిక సంస్థల టికెట్లు కేటాయిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఇంతకాలంగా ఉన్నాం.. ఇంత పనిచేశాం..అంత పనిచేశామనే ప్రచారానికి పరిమితం కాకుండా గ్రౌండ్‌లెవల్‌లో పార్టీ ఫలితాల సాధన కు ఏ మేరకు వారి కృషి ఉందనే అంశాన్ని నాయ కత్వం బేరీజు వేయనున్నట్టు తెలుస్తోంది.
వివిధ స్థాయిల్లో పార్టీ అభ్యర్థులు మంచి ప్రదర్శన కన బరచడంలో స్థానిక నేతల కృషి, సాధించిన ఫలి తాలు కొలమానం చేయడం ద్వారా నాయకులు, కార్యకర్తల్లో మరింత అంకితభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 2,3 నెలల్లో గ్రామీణ, ఆ తర్వాత మున్సిపాలిటీల ఎన్నికలు జరగొచ్చన్న అంచనాల మధ్య పార్టీలో స్థానికంగా వివిధస్థాయిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది కూడా త్వరలోనే మొదలు మొదలవుతుందని సమాచారం. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలి తాలు వెలువడ్డాక, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్మీ సెగ్మెంట్లు, పోలింగ్‌బూత్‌ల వారీగా పార్టీకి పడి న ఓట్ల వివరాలు వెల్లడయ్యాక ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని పార్టీనేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment