'హైదరాబాద్ను అభివృద్ధి చేసేది టీడీపీ-బీజేపీనే' | Hyderabd to be developed by TDP-BJP only, says Revanth reddy | Sakshi

'హైదరాబాద్ను అభివృద్ధి చేసేది టీడీపీ-బీజేపీనే'

Published Wed, Jan 6 2016 6:04 PM | Last Updated on Fri, Sep 7 2018 2:12 PM

'హైదరాబాద్ను అభివృద్ధి చేసేది టీడీపీ-బీజేపీనే' - Sakshi

'హైదరాబాద్ను అభివృద్ధి చేసేది టీడీపీ-బీజేపీనే'

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేది టీడీపీ, బీజేపీనేనని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేది టీడీపీ, బీజేపీనేనని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ ఒక జట్టు, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక జట్టుగా ఆయన పేర్కొన్నారు. బుధవారం రేవంత్ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు.

భారతదేశాన్ని పది నిమిషాల్లో శ్మశానంగా మారుస్తానన్న వారికి ఓటు వెయ్యాలా వద్దా అనేది ఓటర్లు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.  కాంగ్రెస్కు ఓటేసినా పరోక్షంగా ఎంఐఎంకే ఓటేసినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పాత్రేంటో ఆయనకే తెలియదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement