ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని కొందరు గ్రామీణులు రాత్రికిరాత్రే లక్షాధికారులయ్యారు. వీరి బ్యాంకు ఖాతాల్లో గుర్తుతెలియని అకౌంట్ నుంచి డబ్బలు జమ అయ్యాయి. సుమారు 40 మంది గ్రామీణుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. దీనికి సంబంధించిన మెసేజ్ రాగానే ఆ ఖాతాదారుల ఆనందంతో చిందులేశారు. ఆ డబ్బు తీసుకునేందుకు బ్యాంకు ముందు క్యూ కట్టారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన కేంద్రపారా జిల్లాలోని ఒడిశా గ్రామ్య బ్యాంకు చెందిన బాటీపాడా శాఖలో చోటుచేసుకుంది. ఖాతారులు తమ అకౌంట్‌లోని పెద్ద మొత్తంలో డబ్బులు జమకావడంతో వారంతా బ్యాంకుకు చేరుకున్నారు. కొందరు తమ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరించుకున్నారు. మరికొందరు డబ్బులు తీసుకోలేకపోయారు.
పలువురు ఖాతాదారులకు అకౌంట్‌లలో వేల రూపాయలు మొదలుకొని 2 లక్షల రూపాయల వరకూ జమ అయ్యాయి. దీనిని గమనించిన బ్యాంకు అధికారులు నగదు విత్‌డ్రాలను నిలిపివేశారు. వినియోగదారుల ఖాతాలలోకి ఈ సొమ్ము ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆయలం.. దీపావళికి ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment