Source
-
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్‌గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్‌పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్‌షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్‌ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. డబ్బులు తీసుకునేందుకు క్యూ!
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని కొందరు గ్రామీణులు రాత్రికిరాత్రే లక్షాధికారులయ్యారు. వీరి బ్యాంకు ఖాతాల్లో గుర్తుతెలియని అకౌంట్ నుంచి డబ్బలు జమ అయ్యాయి. సుమారు 40 మంది గ్రామీణుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. దీనికి సంబంధించిన మెసేజ్ రాగానే ఆ ఖాతాదారుల ఆనందంతో చిందులేశారు. ఆ డబ్బు తీసుకునేందుకు బ్యాంకు ముందు క్యూ కట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన కేంద్రపారా జిల్లాలోని ఒడిశా గ్రామ్య బ్యాంకు చెందిన బాటీపాడా శాఖలో చోటుచేసుకుంది. ఖాతారులు తమ అకౌంట్లోని పెద్ద మొత్తంలో డబ్బులు జమకావడంతో వారంతా బ్యాంకుకు చేరుకున్నారు. కొందరు తమ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరించుకున్నారు. మరికొందరు డబ్బులు తీసుకోలేకపోయారు. పలువురు ఖాతాదారులకు అకౌంట్లలో వేల రూపాయలు మొదలుకొని 2 లక్షల రూపాయల వరకూ జమ అయ్యాయి. దీనిని గమనించిన బ్యాంకు అధికారులు నగదు విత్‌డ్రాలను నిలిపివేశారు. వినియోగదారుల ఖాతాలలోకి ఈ సొమ్ము ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆయలం.. దీపావళికి ప్రారంభం -
‘ఫేక్ న్యూస్’పై ఫేస్బుక్, గూగుల్ పోరు
శాన్ఫ్రాన్సిస్కో: పాఠకులు నిజమైన, నమ్మకమైన వార్తల ఆధారాలను (సోర్స్) గుర్తించడంలో సాయపడేందుకు ఏర్పాటైన ‘ది ట్రస్ట్ ప్రాజెక్టు’లో ఫేస్బుక్, గూగుల్, ట్వీటర్ సామాజిక మాధ్యమాలు భాగస్వాములయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో భాగంగా ఫేస్బుక్ న్యూస్ ఫీడ్‌లోని కథనాలపై ఒక గుర్తు కన్పిస్తుంది. ఆ గుర్తుపై నొక్కితే వార్తకు సంబంధించిన సంస్థ వివరాలు, జర్నలిస్టు నేపథ్యం వంటివి కన్పిస్తాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలు నడుపుతున్న న్యూస్ వెబ్సైట్లు ఇప్పటికే ట్రస్ట్ ఇండికేటర్లను వారి వార్తలపై చూపిస్తున్నట్లు శాంటాక్లారా యూనివర్సిటీ తెలిపింది. పాఠకుడు చదివే సమాచారం వార్తనా? అభిప్రాయమా? విశ్లేషణనా? ప్రకటనా? అనేది పేర్కొంటున్నట్లు తెలిపింది. -
ఢాకా దాడి ఆయుధాలు దొరికాయ్!
బంగ్లాదేశ్ః ఢాకా కేఫ్ లో దాడికి ఉగ్రవాదులు వినియోగించిన ఆయుధాలను పోలీసులు గుర్తించారు. విదేశీయులే లక్ష్యంగా ఓ భారత యువతి సహా 22 మంది ని కిరాతకంగా హతమార్చిన టెర్రరిస్టులు.. దాడులకు వాడిన ఆయుధాలను కనుగొనడంలో తాము సఫలమైనట్లు బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఆయుధాలద్వారా వాటిని సరఫరా చేసినవారిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్ ఏకేఎమ్ షహీదుల్ తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేఫ్ దాడిలో ఉగ్రవాదులు దాడికి వినియోగించిన ఆయుధాలు అంత ఆధునికమైనవేమీ కాదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయుధాలను కనుగొన్నామని, వాటిని సరఫరా చేసినవారిని త్వరలో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు ప్రజల సహాయాన్ని కూడా కోరినట్లు పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్ ఏకేఎమ్ షహీదుల్ తెలిపారు. ఇప్పటికే దాడుల సూత్రధారులను గుర్తించి నిఘాలో ఉంచినట్లు షహీదుల్ తెలిపారు. 12 గంటలపాటు జరిగిన మారణహోమంపై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించి, వారి సహాయంతో తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దాడుల అనంతరం ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు తప్పించుకున్నవారి జాబితాను తయారు చేస్తున్నామని, నిర్థారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవలి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు దేశంలోని విద్యాసంస్థలకు చెందిన వారుగా గుర్తించడంతో.. విద్యా సంస్థలపైనా పూర్తి నిఘా పెట్టినట్లు హక్ తెలిపారు. అంతేకాక దాడి వెనుక అంతర్జాతీయ హస్తం ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడి సందర్భంలో అప్రమత్తమైన భద్రతా దళాలు రెస్టారెంట్ ను చుట్టుముట్టి ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చి, ఒకరిని సజీవంగా పట్టుకున్న విషయం తెలిసిందే. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు వాయవ్య బోగ్రాలోని ఓ గ్రామానికి చెందిన మదర్సా విద్యార్థి అని, అతడే దాడికి సారథ్యం వహించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఓ భారతీయ యువతి సహా 22 మంది మరణించడంతోపాటు, 30 మంది వరకూ గాయపడ్డ దాడికి తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్ బృదం ఎమాక్ వార్తా సంస్థద్వారా అప్పట్లో వెల్లడించింది. అయితే ఉగ్రవాదులు ధరించిన దుస్తులను బట్టి దాడి వెనుక తీవ్రవాద సంస్థ జమాత్ ఉల్ హెజాహిదీన్ ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. -

ఢాకా దాడి ఆయుధాలు దొరికాయ్..!

భోజనంఅధ్వానం
=సక్రమంగా అమలుకాని మధ్యాహ్న భోజన పథకం =మెనూలో మాయమవుతున్న గుడ్డు =కూరగాయల స్థానంలో పలచని సాంబారు బడిఈడు పిల్లల చదువుకునే హక్కు ఆకలి మంటల్లో అణగారిపోరాదన్న సంకల్పంతో మధ్యాహ్నభోజన పథకం రూపుదాల్చింది. భోజ నం తయారీ ఖర్చులు, వంటశాలల నిర్మాణం, పథకం విస్తరణ సహా వివిధ అంశాల్లో ప్రభుత్వం వైఫల్యం సుస్పష్టం. అందుకే విద్యార్థులకు నాసిరకం ఆహారం దక్కుతోంది. పోషకాహారానికి అతీగతీ లేకుండాపోతోంది. చాలా పాఠశాలల్లో నీళ్ల చారుతోనే సరిపెడుతున్నారు. నామమాత్రపు నిధుల కేటాయింపు, కంటితుడుపు పర్యవేక్షణతో ఈ పథకం అఘోరిస్తోంది. నక్కపల్లి,న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు పౌష్టికాహారం అందడంలేదు. కొన్ని పాఠశాలల్లో భోజనం తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తిన్నా కడుపు నిండటంలేదంటున్నారు. పర్యవేక్షణ లోపంతో వారానికి రెండుసార్లు గుడ్డు పెట్టడం లేదు. సరఫరా చేస్తున్న బియ్యంలో నాణ్యతలోపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు, నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. భోజనం తయారీకి వంటషెడ్లులేక, సకాలంలో బిల్లులు అందక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. నవంబరు నుంచి వీరికి బిల్లులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 4170 ప్రాథమిక,ప్రాథమికోన్నత, జెడ్పీ పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు రోజుకు రూ.4.35పైసలు,7నుంచి10 వ తరగతి విద్యార్థులకు రూ.6లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ధరకు ఒక ఇడ్లీ కూడా రాదు. ప్రాథమిక తరగతులు విద్యార్థులకు రోజుకు 100గ్రాముల బియ్యం,5 గ్రాముల నూనె,20 గ్రాముల పప్పు,50గ్రాములు కూరగాయలు, యూపీ పాఠశాలల విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం,30 గ్రాముల పప్పు,75 గ్రాముల కూరగాయలుపెట్టాలని ప్రభుత్వం పేర్కొంది. ఆమేరకు మెస్ చార్జీలు చెల్లిస్తోంది. ఈ ప్రకారం విద్యార్థుల కడుపు నిండటం లేదు. కిలో బియ్యాన్ని పది మందికి సర్దడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారానికి రెండు సార్లు పెట్టే గుడ్డుకు ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు లేవని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం గుడ్డుధర నాలుగు నుంచి ఐదు రూపాయలు ఉందని, 300 పైబడి విద్యార్థులున్న పాఠశాలలో గుడ్ల కోసం అయ్యే ఖర్చంతా నిర్వాహకులే భరించాల్సి వస్తోంది. జిల్లా అంతటా ఒకే విధంగా మెనూ అమలు కావడం లేదు. నిర్వాహకులను బట్టి ఒక్కో పాఠశాలలో ఒక్కోలా ఉంటోంది. ప్రతి సోమ, గురువారాల్లో గుడ్డు పెట్టాల్సి ఉండగా కొన్ని పాఠశాలల్లో కానరావడం లేదు. నక్కపల్లి మండలంలో కొందరు విద్యార్థులు ఇళ ్లనుంచి కూరలు, కేరేజీలు తెచ్చుకునే దుస్థితి. దోసలపాడు పాఠశాలలో గురువారం గుడ్డుపెట్టాల్సి ఉండగా సాంబారు అన్నం మాత్రమే పెట్టారు. ఈ పాఠశాలలో ప్రతి బుధవారం గుడ్డు పెడుతున్నట్టు చార్టులో పేర్కొన్నారు. క్రిస్మస్ పండగ కావడంతో బుధవారం పాఠశాలకు సెలవు. గురువారం కూడా పెట్టలేదు. పాయకరావుపేట నాగనరసింహ పాఠశాలలో కూడా గురువారం గుడ్డుపెట్టలేదు. చాలా పాఠశాలల్లో వంటషెడ్లు లేవు. తరగతి గదుల పక్కనే కట్టెల పొయ్యిలతో వండుతున్నారు. పొగకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నక్కపల్లి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకవైపు తరగతి గది, మరోవైపు కట్టెలపోయ్యి ఉంటోంది. ఎస్రాయవరంమండలం వమ్మవరం పాఠశాలలో వంటషెడ్లేక ఇంటిదగ్గర భోజనం తయారు చేసి తెస్తున్నారు. ఈ భోజనం ముద్దగా ఉంటోందని తింటే కడుపునొప్పి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. ఇళ్ల నుంచి బాటిళ్లతో నీరు తెచ్చుకుంటున్నారు.