శాన్‌ఫ్రాన్సిస్కో: పాఠకులు నిజమైన, నమ్మకమైన వార్తల ఆధారాలను (సోర్స్) గుర్తించడంలో సాయపడేందుకు ఏర్పాటైన ‘ది ట్రస్ట్ ప్రాజెక్టు’లో ఫేస్‌బుక్, గూగుల్, ట్వీటర్ సామాజిక మాధ్యమాలు భాగస్వాములయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో భాగంగా ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌లోని కథనాలపై ఒక గుర్తు కన్పిస్తుంది. ఆ గుర్తుపై నొక్కితే వార్తకు సంబంధించిన సంస్థ వివరాలు, జర్నలిస్టు నేపథ్యం వంటివి కన్పిస్తాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలు నడుపుతున్న న్యూస్ వెబ్‌సైట్లు ఇప్పటికే ట్రస్ట్ ఇండికేటర్లను వారి వార్తలపై చూపిస్తున్నట్లు శాంటాక్లారా యూనివర్సిటీ తెలిపింది. పాఠకుడు చదివే సమాచారం వార్తనా? అభిప్రాయమా? విశ్లేషణనా? ప్రకటనా? అనేది పేర్కొంటున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment