భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.
ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్‌డేట్ కార్యక్రమంలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్‌వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు.
సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment