బహుశా ఇది ప్రపంచంలోనే అతి చిన్నబ్యాంకు. అమెరికాలోని కెంట్‌లాండ్‌లో ఉంది. ‘కెంట్‌లాండ్ ఫెడరల్ సేవింగ్స్ అండ్ లోన్’ పేరుతో ఈ బ్యాంకు దాదాపు శతాబ్దానికి పైగా విజయవంతంగా నడుస్తోంది. బడా బడా బ్యాంకులు ఎన్ని పుట్టుకొచ్చినా, వాటన్నింటికీ భిన్నంగా ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించదు. అంతేకాదు, ఈ బ్యాంకుకు ఏటీఎం కూడా లేదు.
ఇందులో పనిచేసేది ఇద్దరు ఉద్యోగులు మాత్రమే! జేమ్స్ ఏ సామన్స్ అనే వ్యక్తి ఈ బ్యాంకు ప్రస్తుత సీఈవో. ఆయన ముత్తాత ఈ బ్యాంకును 1920లో నెలకొల్పాడు. అప్పటి నుంచి ఈ బ్యాంకు నిరాటంకంగా నడుస్తోంది. ఈ బ్యాంకు తన కస్టమర్లను ఫోన్‌కాల్స్‌తో, ఎస్‌ఎంఎస్‌లతో విసుగెత్తించదు. ఇప్పటికీ పాతకాలం పద్ధతుల్లోనే లావాదేవీలు నిర్వహిస్తోంది. అంతేకాదు, లావాదేవీలపై కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయదు కూడా! ఆన్‌లైన్ లావాదేవీల కాలంలో ఇలాంటి బ్యాంకు ఇంకా మనుగడ కొనసాగిస్తుండటం నిజంగా విశేషమే కదూ!
Comments
Please login to add a commentAdd a comment