న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను పక్కాగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వ్యాపార వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే పేరు మార్పు, కామిక్ ఖాతాలను శాశ్వతంగా బ్యాన్ చేస్తామని ప్రకటించిన మస్క్ తొలి వేటు వేశారు. (మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్‌డేటెడ్ ఫీచర్లతో)
తాజాగా హాస్య నటి కాథీ గ్రిఫిన్‌కు భారీ షాకిచ్చారు మస్క్. ఏకంగా తన పేరుతోనే కామెడీ చేయడంతో సీరియస్‌గా స్పందించారు. ఎలాన్ మస్క్ పేరుతో కాథీ తన ట్విటర్ ఖాతాపేరును, ప్రొఫైల్ పిక్చర్‌నుమార్చుకోవడంతోపాటు,అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థులకు మద్దతి వ్వాల్సిందిగా ప్రజలను కోరడంతో ఆమె ఖాతాను శ్వాశతంగా సస్పెండ్ చేశారు. దీనికితోడు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్‌కి మద్దతు కలడం ట్విటర్ కొత్త బాస్ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. వాక్ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తున్నారంటూ పలువురు మస్క్‌పై మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మస్క్, కావాలంటే ఆమె 8 డాలర్లు చెల్లించి (బ్లూ టిక్ ఫీజు) ఖాతాను తిరిగి పొందవచ్చంటూ ట్వీట్ చేశారు. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్)
కాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్ మస్క్ బ్లూ టిక్ ఫీజును తీసుకురావడం సంచలనంగా మారింది. అలాగే కీలక ఎగ్జిక్యూటివ్‌లతో పాటు, పలువురు ఉద్యోగుల తొలగింపు కలకలం రేపింది. నకీలీ,పేరడీ ఖాతాలపై శాశ్వతంగా వేటు వేయనున్నట్టు ప్రకటించారు. అదీ పేరడీ అని లేబుల్ లేకుండానే ప్రముఖులు, పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి సరదా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లకు వేటు తప్పదంటూ మస్క్ ఆదివారం వరుస ట్వీట్లలో వార్నింగ్ ఇచ్చారు. గతంలో లాగా ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఎలాంటి నోటీసు లేకుండా పర్మినెంట్‌గా బ్యాన్ చేస్తామంటూ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
BREAKING: @KathyGriffin has been permanently suspended from Twitter for impersonating @ElonMusk pic.twitter.com/ust86DZHKj
— Benny Johnson (@bennyjohnson) November 6, 2022
But if she really wants her account back, she can have it
— Elon Musk (@elonmusk) November 7, 2022
Comments
Please login to add a commentAdd a comment