
సాక్షి,హైదరాబాద్: ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం(మే 6)రైతు బంధు నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకుగాను రూ.2 వేల కోట్ల దాకా ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం.
మూడు రోజుల్లో మొత్తం రైతుబంధు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఐదెకరాల పైన ఉన్నవారికి నగదు బదిలీ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment