
ఏమిటీ లెక్కలు..? ఏదైనా పెళ్లి తంతో.. లేక ఫంక్షన్ కోసమో ? అనుకుంటున్నారా..! కాదు.. ఇవీ ఎన్నికల ‘లెక్కలు’! సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఇక పోలింగ్ ముగిసే వరకు పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రచారాలు చేయడం.. వారి వెంట మందీ మార్బలం, వాహనాలు, తదితరమైనవి ఉండటం తెలిసిందే. ఏ రకంగా ఖర్చు చేసినా, ఎంతమందితో ర్యాలీలు నిర్వహించినా, వివిధ రూపాల్లో ప్రచారార్భాటాలు చేసినా అంతా లెక్క చెప్పాల్సిందే.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. ఆ లోపునే ఖర్చు చేయడమే కాక నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతిపైసాకు తప్పనిసరిగా లెక్క చూపాల్సిందే. అలాగని ఎక్కువ ఖర్చు చేసినా తక్కువ చూపితే సరిపోదు. అభ్యర్థులు వినియోగించే ప్రచార సామగ్రి, ప్రచారానికయ్యే ఖర్చులను, వెంట వచ్చే మద్దతుదారులు, కార్యకర్తలకు టీలు, టిఫిన్లు తదితరమైన వాటికి మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు.
ధరలు నిర్ణయించడానికి ముందు ఆయా పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని, అన్నీ బేరీజు వేస్తారు. ఇలా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము చేసే ఖర్చులు.. వేటికి ఎంత చూపాలో ధరలు నిర్ణయించారు. నిర్ణయించిన ధరల కంటే తక్కువ చూపితే ఎన్నికల వ్యయంలో పేర్కొన్న లెక్కల్ని ఆమోదించరు. మొత్తం 105 వస్తువులు/సరుకులకు ధరలు నిర్ణయించారు. వాటిల్లో కొన్నింటి ధరలిలా ఉన్నాయి.. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment