
సమాచార సాంకేతికత (ఐటీ), టెలికం మంత్రిత్వశాఖల కింద పనిచేసే విభాగాల అకౌంట్లలో తీవ్ర అవకతవకలు ఉన్నట్లు కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఒకటి పేర్కొంది.
నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఐసీఎస్‌ఐ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటల్ సర్వీస్) ద్వారా రూ. 890 కోట్ల విలువైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కొనుగోళ్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నివేదికలను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, సీ–డాట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ , ఐటీఐ లిమిటెడ్, సీడీఏసీ తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఆర్థిక పరిణామాలకు దారితీసేవిగా ఉన్నాయని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక పేర్కొంది.
డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) ద్వారా ప్రింట్ మీడియా ప్రకటన విడుదలకు సంబంధించిన ప్రభుత్వ సూచనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈజీడీ) విఫలమైందని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీని ఫలితం రూ.1.21 కోట్ల అనవసర చెల్లింపులు జరిగాయని అంచనాలకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment