సాక్షి, అమరావతి: ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఓ పక్క గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతూనే, రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నారు. మరోపక్క ప్రజలకు డిజిటల్ వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా)ల సృష్టిలోనూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు.
దీంతో డిజిటల్ హెల్త్ అకౌంట్‌ల సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ఆభా రిజి్రస్టేషన్లు చేశారు. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4,10,49,333 ఖాతాలతో ఏపీ రెండో స్థానంలోఉంది. 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్–5లో లేదు. కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో 8వ స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.
ఇదీ డిజిటల్ ఖాతా
ఆభా అకౌంట్‌లో ప్రతి పౌరుడికి 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ ఇస్తారు. వ్యక్తి ఆరోగ్య చరిత్ర మొత్తం ఇందులో నమోదు చేస్తారు. ఎప్పటికప్పు డు ఇది అప్‌డేట్ అవుతుంటుంది. ఓపీ, ఐపీ స్లి ప్పులు, వైద్య పరీక్షల ఫలితాలు, పాత చికిత్స తా లూకూ ఫైళ్లు వంటి మోతబరువు లేకుండా దేశంలో ఎక్కడి నుంచి అయినా ఒక్క క్లిక్‌తో ఆరోగ్య చరిత్ర అందుబాటులోకి తేవడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)ను కేంద్రం ప్రవేశపెట్టింది. పేపర్ రహిత సేవలు అందించడానికి వీలుగా ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తోంది.
చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..
ఏబీడీఎం అమలులో ఏపీ తొలి నుంచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి ఆభాలు రిజిస్టర్ చేయడం లక్ష్యం కాగా, ఇప్పటికి 85% మందికి రిజి్రస్టేషన్ పూర్తి చేశారు. మొత్తం జనాభాలో ఆభా రిజిస్టర్ కవరేజ్ పరంగా దేశంలోనే తొలిస్థానంలో ఏపీ నిలుస్తోంది. రాష్ట్రంలోని 14,368 ఆసుపత్రులు, 20,467 మంది వై ద్యులు, వైద్య సిబ్బంది ఏబీడీఎంలో రిజిస్టర్ అ య్యారు. పీహెచ్‌సీ నుంచి బోధనాస్పత్రి వరకు అ న్ని స్థాయిల్లో ఈ–హెచ్‌ఆర్ విధానాన్ని ప్రశేపెట్టి ప్ర జలకు డిజిటల్ వైద్య సేవలను వైద్య శాఖ అంది స్తోంది. ఏపీ విధానాలను అవలంబించాలని నేషన ల్ హెల్త్ అథారిటీ అన్ని రాష్ట్రాలకు సూచించింది. మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు ఏపీకి వచ్చి ఇక్కడి విధానాలను తెలుసుకుని వెళ్లారు.
ఆరోగ్య రికార్డులు పదిలం
డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా ప్రతి వ్యక్తి ఆ రోగ్య రికార్డులు ఆన్‌లైన్‌లో పదిలంగా ఉంటా యి. వంద శాతం పౌరులందరికీ ఆభా రిజిస్ట్రేషన్ త్వరలోనే పూర్తి అవుతుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ–హెచ్‌ఆర్ అమలు చేస్తున్నాం. ఈ విధానంపై ఆస్పత్రుల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం.
– జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment