లక్షల ఖాతాలను లాక్ చేసిన ట్విట్టర్ | Twitter locks millions of accounts for user security | Sakshi
Sakshi News home page

లక్షల ఖాతాలను లాక్ చేసిన ట్విట్టర్

Published Sat, Jun 11 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

లక్షల ఖాతాలను లాక్ చేసిన ట్విట్టర్

లక్షల ఖాతాలను లాక్ చేసిన ట్విట్టర్

న్యూఢిల్లీ: ప్రముఖులు, సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ వ్యవహారంలో మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ముందు లీక్ వ్యవహారం లేదని వాదించిన  ట్విట్టర్‌ ..ఈ  వ్యవహారంపై ఆరా తీసింది. అనంతరం మిలియన్ల కొద్దీ ఖాతాలను  లాక్ చేసినట్టు ప్రకటించింది.  వినియోగదారుల భద్రత రీత్యా  ఈ చర్య తీసుకున్నట్టు ట్విట్టర్  అధిపతి మైఖేల్  కోట్స్ తెలిపారు.   
 
 దుమారం రేపిన ఈ హ్యాకింగ్ వ్యవహారంపై ట్విట్టర్ స్పందించిన  ట్విట్టర్‌ ..డైరెక్ట్ పాస్వర్డ్  ఎక్స్ పోజర్ ను లాక్ చేసినట్టు వెల్లడించింది. తమ ఖాతాదారులందరూ పాస్ వర్డ్ ను రీసెట్ చేసుకోవాలని  సూచించింది.  మొత్తం ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతీ అంశాన్ని క్రాస్ చెక్ చేశామని సంస్థ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మరింత భద్రత అవసరమనే విషయాన్ని గ్రహించామని తెలిపారు.  యూజర్ల  ఖాతాల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యకు ఉపక్రమించినట్టు తెలిపారు.  అయితే ఎన్ని ఖాతాలు  హ్యాక్ అయ్యాయనే  విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. యూజర్లు పటిష్టమైన పాస్ వర్డ్స్, టు-స్టెప్ వెరిఫికేషన్ ద్వారా తమ ఖాతాలను సెక్యూర్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. యాప్ నోటిఫికేషన్స్, మెసేజ్ ల ద్వారా  జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.

 కాగా ఏకంగా 33 మిలియన్ల  నెటిజన్ల యూజర్ నేమ్స్‌, పాస్‌వర్డ్స్‌ ను హ్యాక్‌ చేసిన ఓ రష్యా హ్యాకర్‌ హ్యాకర్  వాటిన ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం ఆందోళన  రేపింది.  ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌, ప్రముఖ సింగర్ కేటీ పెర్రీ సహా ఎంతోమంది సినీతారలు, ప్రముఖుల ఖాతాల వివరాలు సహా, యూజర్లలో పదిశాతం మంది ఈ హ్యాకింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవని కొట్టిపారేసిన  ట్విట్టర్.. చివరకు  భద్రతా చర్యలకు ఉపక్రమించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement