ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్బొల్లా మధ్య చోటు చేసుకున్న మిసైల్స్, రాకెట్ల దాడులు మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.ఈ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న నేతలు నిద్రలో పోతుండటం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయని, ఇలా కొనాసాగితే మూడో ప్రపంచం యుద్ధం రావటం ఖాయమని ‘ఎక్స్’ వేదికగా అన్నారు.
‘మధ్యప్రాచ్యంలో దాడులు జరగకుండా ఎవరు చర్చలు జరుపుతున్నారు? అక్కడ బాంబులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని బీచ్‌లో నిద్రిస్తున్నాడు. ఆయన డెమోక్రాట్‌లచే దుర్మార్గంగా బహిష్కరించబడ్డారు. కామ్రేడ్ కమల తన ప్రచారం బృందంతో బస్సు యాత్ర చేస్తోంది. కమల రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ ఒక చెడ్డ ఎంపిక. సరైన వాళ్లును ఎంచుకోండి. మూడో ప్రపంచ యుద్ధం మనకు వద్దు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము’ అని ట్రంప్ విమర్శలు చేశారు.
Who is negotiating for us in the Middle East? Bombs are dropping all over the place! Sleepy Joe is sleeping on a Beach in California, viciously Exiled by the Democrats, and Comrade Kamala is doing a campaign bus tour with Tampon Tim, her really bad V.P. Pick. Let’s not have World…
— Donald J. Trump (@realDonaldTrump) August 25, 2024
మధ్యప్రాచ్యంలో చోటు చేసుకుంటున్న ఘర్షణలను నిలువరించటంపై అమెరికా నాయకత్వంపై పలు సందేహాలను కలుగుతున్నాయని అన్నారు. సంఘర్షణకు దారితీసే ఉద్రిక్తతల తీవ్రతలను నివారించే మార్గాలను చర్చించడానికి యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ సిక్యూ బ్రౌన్.. మిడిల్ ఈస్ట్‌లో అనూహ్య పర్యటన తర్వాత ఈ దాడులు జరగటం గమనార్హం.
ఆదివారం లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం మిసైల్స్‌తో దాడి చేసింది. హిజ్బుల్లా ఉగ్రసంస్థ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎందుర్కొనేందుకు ఈ ముందస్తు దాడులను చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సుమారు 40 మిసైల్స్‌ను ఇజ్రాయెల్ లెబనాన్‌పై ప్రయోగించింది.అయితే ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా వెంటనే స్పందించిన హిజ్బుల్లా ఉగ్రసంస్థ.. ఇజ్రాయెల్‌పై సుమారు 320 కట్యూషా రాకెట్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment